Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ చికిత్సకు అధిక ఫీజు: ఎస్పీ తనిఖీల్లో అడ్డంగా దొరికిన హాస్పిటల్.. ఎండీ అరెస్ట్

అధిక ఫీజులు వసూలు చేసే ఆసుపత్రులపై అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసు బాబు సీరియస్ అయ్యారు. ఎస్వీ ఆసుపత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. కోవిడ్ రోగి నుంచి రోజుకు రూ.25 వేలు వసూలు చేస్తున్న ఎస్వీ ఆసుపత్రి ఎండీ రవిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. 

anantapur district sp sudden visit in covid hospital ksp
Author
Anantapur, First Published Apr 28, 2021, 8:49 PM IST

అధిక ఫీజులు వసూలు చేసే ఆసుపత్రులపై అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసు బాబు సీరియస్ అయ్యారు. ఎస్వీ ఆసుపత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. కోవిడ్ రోగి నుంచి రోజుకు రూ.25 వేలు వసూలు చేస్తున్న ఎస్వీ ఆసుపత్రి ఎండీ రవిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకస్మిక తనిఖీల్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఎస్పీ. కరోనా పేరుతో దోపిడికి పాల్పడే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. 

కాగా, రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో చేసే పరీక్షలపై అధిక ఫీజులు వసూలు చేస్తే  చర్యలు తీసుకొంటామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ విషయమై దృష్టి పెట్టింది.

Also Read:ఏపీపై కరోనా దండయాత్ర: ఒక్కరోజులో 14 వేలకు పైగా కేసులు.. 71 మరణాలు

కరోనా బాధితులకు చేసే సిటీ స్కాన్, హెచ్ఆర్ సిటీ స్కాన్ ల పేరుతో చేసే దోపిడికి అడ్డుకట్ట వేసింది. ఈ మేరకు సీటీ స్కాన్ ధరను నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఈ ధరలను  ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు విడుదల చేసింది. సిటీ స్కాన్ లేదా హెచ్ఆర్ సిటీ స్కానింగ్ కు గరిష్టంగా రూ. 3 వేలను నిర్ణయించారు.

స్కానింగ్ సమయంలో వాడే పీపీఈ కిట్లు, మాస్క్ ,స్ప్రైడ్  షీట్లతో కలిపి ఈ ధరను నిర్ణయించామని ప్రభుత్వం తెలిపింది. స్కానింగ్  అనంతరం అనుమానితుల వివరాలను కోవిడ్ డాష్ బోర్డు వెబ్ సైట్లో తప్పక నమోదు చేయాలని ఆదేశించింది.

ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ అన్నిజిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తే  చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios