ఏపీపై కరోనా దండయాత్ర: ఒక్కరోజులో 14 వేలకు పైగా కేసులు.. 71 మరణాలు
ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 14,669 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారినపడిన వారి సంఖ్య 10,69,544కి చేరింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలోని మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటకలతో ఏపీ పోటీపడేలా కనిపిస్తోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలు విధించినప్పటికీ ఫలితం మాత్రం ఆశించిన మేర కనిపించడం లేదు.
తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 14,669 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారినపడిన వారి సంఖ్య 10,69,544కి చేరింది.
నిన్న రాష్ట్రంలో 74,681 పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకూ మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 1,62,17,831కి చేరింది. కరోనాతో బాధపడుతూ గడిచిన 24 గంటల్లో 71 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona