ఆనందయ్య మందు: సీసీఆర్ఏఎస్‌కి చేరిన డేటా, చేప మందు తరహలో అవకాశమిస్తారా?

ఆనందయ్య తయారు చేసిన మందుపై ఇప్పటి వరకు సేకరించిన  పరిశోధన ఫలితాలను సీసీఆర్ఏఎస్‌కి అధికారులు పంపారు. బుధవారం నాడు రాత్రికి ఈ పరిశోధన ఫలితాలు న్యూఢిల్లీలోని సీసీఆర్ఏఎస్‌కి చేరాయి. 

AP officials sends data report of Anandaya medicine data to CCRAS lns

నెల్లూరు: ఆనందయ్య తయారు చేసిన మందుపై ఇప్పటి వరకు సేకరించిన  పరిశోధన ఫలితాలను సీసీఆర్ఏఎస్‌కి అధికారులు పంపారు. బుధవారం నాడు రాత్రికి ఈ పరిశోధన ఫలితాలు న్యూఢిల్లీలోని సీసీఆర్ఏఎస్‌కి చేరాయి. దాదాపుగా ఆరు రోజుల నుండి ఆనందయ్య మందు పంపిణీని నిలిచిపోయింది.ఈ మందు గురించి శాస్త్రీయంగా విశ్లేషించిన తర్వాత ఎలాంటి హాని లేదని తేలిన తర్వాత  పంపిణీ చేయాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆనందయ్యను కృష్ణపట్టణం పోర్టు వద్ద పోలీసుల సంరక్షణలో ఉన్నాడు.  విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద కాలేజీ, తిరుపతి ఆయుర్వేద కాలేజీకి చెందిన వైద్యులు ఆనందయ్య తయారు చేసిన మందును వాడిన రోగుల నుండి డేటాను సేకరించారు. 

also read:ఆనందయ్య మందుపై తొలి దశ అధ్యయనం పూర్తి... సీసీఆర్ఏఎస్‌ నిర్ణయంపై ఉత్కంఠ

ఆనందయ్య మందు తీసుకొన్న 500 మంది రోగుల డేటాను  సీసీఆర్ఏ‌ఎస్‌కి  సమర్పించారు. ఈ రిపోర్టు నెగిటివ్ గా ఉంటే   మాత్రం  సీసీఆర్ఏఎస్ రిపోర్టు అనుకూలంగా ఉండే అవకాశం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఆనందయ్య ఆయుర్వేద శాస్త్రం చదవలేదు. మరోవైపు ఆయుర్వేద చట్టం ప్రకారంగా ఆయన ఈ మందును తయారు చేసినట్టుగా రుజువు చేసుకోవాలి. చట్ట ప్రకారంగా అన్నీ జరిగితేనే ఆనందయ్య మందును ఆయుర్వేద మందుగా గుర్తిస్తారు. కానీ ఆనందయ్య మందును ఆయుర్వేద మందుగా గుర్తించ అవకాశాలు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు హైద్రాబాద్ లో చేప మందు పంపిణీ తరహలోనే ఆనందయ్య మందు పంపిణీకి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా అనే విషయమై కూడ అధికారులు చర్చిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios