నెల్లూరు: ప్రభుత్వం నుండి అనుమతి రాకపోవడంతో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మందు పంపిణీకి ఆనందయ్య ఆదివారం నాడు శ్రీకారం చుట్టారు. సోమవారం నుండి ఇతర ప్రాంతాలకు చెందిన వారికి మందు పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది.రెండు వారాల తర్వాత మందు పంపిణీని ఆదివారం నాడు ఆయన చేపట్టారు. మూడు రోజుల క్రితమే ఆయన మందు తయారీని ప్రారంభించాడు. ఆన్‌లైన్ లోనే మందు పంపిణీ చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. 

సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ముందుగా మందును పంపిణీ చేయాలని ఆయన భావించారు. ఈ మేరకు ఇవాళ స్థానికులకు  మందును అందిస్తున్నారు. మందు కోసం ఎవరూ కూడ కృష్ణపట్టణం రావొద్దని ఆయన మరోసారి ప్రజలను కోరారు. గత నెల 21న మందు పంపిణీని నిలిపివేశారు. ఆయుష్ నివేదిక ప్రకారంగా మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

also read:ఆనందయ్య మందుపై విమర్శలు: సోమిరెడ్డిపై కేసు నమోదు

ఆనందయ్య మందు పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఓ వెబ్‌సైట్ ను తయారు చేయిస్తామని ప్రకటించింది.ఆన్ ‌లైన్ లో నే  ఆర్డర్ చేస్తే వారికి నేరుగా పంపిణీ చేయనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే  పోస్టల్ ద్వారా ఇంటికి చేరవేస్తామని కూడ ప్రభుెత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇతర ప్రాంతాల వారికి సోమవారం నుండి మందును సరఫరా చేస్తామని చెబుతున్నారు.