ప్రజలను ఆకట్టుకోవడంలో,  ఎక్కడున్నా తనదయిన శైలిని ప్రదర్శించడంలో మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య.  జనంలో మమేకంలో కావడంలో తెలుగు నాట ఆయనకు మించిన రాజకీయ నేత మరొకరు లేరు. జనంలో కలిసేపోయేందుకు ఎన్నివేషాలో వేసే వారో లెక్కలేదు.
బైక్‌పై జామ్మని దూసుకెళ్లాడు, పబ్లిక్‌లో సిగెరట్ విలాసంగా  కాల్చడం, చీర సింగారించుకోవడం, మీసాలు ప్రదర్శించడం... పాటలు పాడటం, డ్యాన్స్ వేయడం...కొన్ని అవతారాలు మాత్రమే... ఎవరినీ లెక్క చేయకపోవడం ఆయనకు మరొక నైజం తిట్టడం మొదలుపెడితే కూడా అంతే, ఎవరూసాటిరారు.  ఆయన కనిపించక పోతే, రాజకీయ సందడే ఉండదు. అలాంటి ఆనం వివేకానందరెడ్డి ఇపుడు ఆసుపత్రిలో ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు.  ఆయన కోలుకోవాలని, మళ్లీ రాజకీయాలను రక్తి కట్టించాలని కోరుకుందాం.