క్రికెట్ బెట్టింగ్‌కు ఓ యువకుడు బలయ్యాడు. చేసిన అప్పు తీర్చలేక.. కుటుంబ పరువు పోతుందన్న మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నాడు.. తనువు చాలించాడు. బెట్టింగ్ భూతానికి అనకాపల్లి జిల్లాలో యువకుడు బలయ్యాడు.

క్రికెట్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. ఈజీగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ ఊబిలోకి దిగుతారు. ఒక్క మ్యాచ్ కాకపోతే.. మరో మ్యాచ్ లో అయినా డబ్బులొస్తాయనే ఆశతో అప్పుల మీద అప్పులు చేస్తుంటారు. చివరికి ఆ అప్పులను తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఊబిలో ప్రధానంగా కాలేజీ కుర్రాళ్లు, యువత పడుతున్నారు. 

తాజాగా ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలోని ఓ కుటుంబంలో క్రికెట్ బెట్టింగ్‌ విషాదం నింపింది. ఓ యువకుడు క్రికెట్ బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోయాడు. ఎక్కడ అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి అడుగుతారో .. తన కుటుంబ పరువు పోతుందన్న మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వివరాల్లోకెళ్తే.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన మణికంఠ సాయికుమార్‌ (25) యువకుడు క్రికెట్‌ బెట్టింగులు, ఇతర ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఆ యాప్స్ లో చిన్న చిన్ని బెట్టింగులు పెట్టడం ప్రారంభించిన మణికంఠ ఆ తర్వాత వాటికి బానిసగా మారాడు. ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్‌ల్లో తీవ్రంగా నష్టపోయి.. అప్పులపాలు అయ్యాడు.

మరోవైపు తన చెల్లి పెళ్లి కోసం దాదాపు 3 లక్షల వరకు అప్పులుగా తెచ్చి ఖర్చు చేశాడు. ఆ అప్పులు.. బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక.. కుటుంబ పరువు పోతుందన్న మనస్థాపానికి గురయ్యాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తనువు చాలించాడు. చేతికి అంది వచ్చినా కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.