Asianet News TeluguAsianet News Telugu

ఆనందయ్య మందు ఎఫెక్ట్: ఆధార్ కార్డు ఉంటేనే కృష్ణపట్నంలోకి ఎంట్రీ

కరోనా మందు పంపిణీ చేస్తున్న బొనిగే ఆనందయ్య గ్రామం కృష్ణపట్నంలోకి పోలీసులు స్థానికేరతరులను అనుమతించడం లేదు. గ్రామంలో పోలీసులు 144వ సెక్షన్ ను అమలు చేస్తున్నారు.

Anadaiah medicine: Non locals were not permitted to enter into Krishnapatnam
Author
Krishnapatnam, First Published Jun 2, 2021, 9:50 AM IST

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోకి స్థానికేతరులను పోలీసులు అనుమతించడం లేదు. కృష్ణపట్నంలో 144వ సెక్షన్ ను అమలు చేస్తున్నారు. ఆనందయ్య మందు కోసం ప్రజలు వచ్చే అవకాశాలు ఉండడంతో వారిని అడ్డగించడానికి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. 

గ్రామస్తులను మాత్రమే వారు కృష్ణపట్నంలోకి అనుమతిస్తున్నారు. వారు కూడా ఆధార్ కార్డు చూపించాల్సిందే. ఆధార్ కార్డు చూపించిన తర్వాత వారు కృష్ణపట్నానికి చెందినవారేనని నిర్దారించుకున్న తర్వాతనే లోనికి అనుమతిస్తున్నారు. 

Also Read: ఆనందయ్య మందు: తయారీ, పంపిణీ నుంచి తప్పుకుంటున్నాం.. వైవీ సుబ్బారెడ్డి సంచలన ప్రకటన

ఆనందయ్య మందు కోసం ఎవరూ కృష్ణపట్నం గ్రామానికి రావద్దని అధికారులు సూచించారు. ఆనందయ్య మందు పంపిణీకి మరో నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని కృష్ణపట్నం పోర్టుకు తరలించారు. హైదరాబాదులో బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప మందు లాగానే ఆనందయ్య తన మందును పంపిణీ చేసుకోవచ్చునని ప్రభుత్వం చెప్పింది. అయితే, మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని, దాన్ని పొందడానికి ఓ ప్రత్యేక యాప్ ను తయారు చేస్తున్నామని చెప్పారు.

ఆనందయ్య మందు పంపిణీపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెనక్కి తగ్గింది. ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని తొలుత ప్రకటించిన టీటీడీ దానిపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని, నాటు మందు మాత్రమేనని ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకుంది.

Also Read: కరోనా థర్డ్ వేవ్ కు నెను రెడీ, రేపటి నుంచే మందు తయారీ: ఆనందయ్య 

కంట్లో వేసే చుక్కల మందుకు తప్ప మిగతా మందుల పంపిణీకి ఆనందయ్యకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందుకు కూడా అనుమతి ఇవ్వాలని ఆనందయ్య హైకోర్టును కోరారు. దీనిపై హైకోర్టు గురువారం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios