గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని కొట్రకోన సమీపంలో ఉన్న నీవానదిలో శనివారం 60 ఏళ్ల వృద్దుడు చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఎన్టీఆర్ జలాశయం గేట్లను మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. 

ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేసారు. పోలీసులు డి ఎస్పీ సుధాకర రెడ్డి నేతృత్వంలోని సి ఐ బాలయ్య, ఎస్సై సుమన్, తహశీల్దార్ ఇన్బానాథన్ లు కృషి చేశారు.  

 రంగంలోకి దిగిన రెస్క్యూ టీం వృద్ధుడిని రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. వారి ప్రయత్నాల ఫలితంగా వృద్ధుడ్ని క్షేమంగా కాపాడారు. నదిలో చిక్కుకున్న వృద్ధుడు కలిజవేడు గ్రామానికి చెందిన అబ్బులయ్యగా  గుర్తించారు. 

తుఫాను కారణంగా భారీగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ లోకి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో వర్షాలు తగ్గేవరకు వాగులు దాటే ప్రయత్నాలు చేయద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. "