Asianet News TeluguAsianet News Telugu

అంఫన్ తుఫాను ఎఫెక్ట్... మత్స్యకార గ్రామంపై విరుచుకుపడుతున్నరాకాసిఅలలు

తీరం దాటకముందే ఆంఫన్ తుఫాను ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖజిల్లాలో సముద్రపు అలలు ముందుకు వచ్చి భయంకరంగా మారాయి. 

amphan toofan effect... Hard waves hit Visakhapatnam coastline
Author
Visakhapatnam, First Published May 19, 2020, 6:54 PM IST

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆంఫన్ తుఫాను తాజాగా అతి తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాను క్రమంగా బలపడుతూ సూపర్ సైక్లోన్ మారుతోంది. ఈ తుఫాను ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై కూడా చూపిస్తోంది. ఇప్పటికే విశాఖ జిల్లా మంగమారిపేటలో సముద్రపు అలలు ముందుకు వచ్చాయి. 

ఈ క్రమంలో మంగమారిపేట గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులకు జాగ్రత్తలు సూచించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు. తీరం దాటే సమయంలో తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వలలు, బోట్లను తీరానికి దూరంగా ఉంచాలని గ్రామస్తులను అప్రమత్తం చేశారు మంత్రి అవంతి. 

read more  దూసుకొస్తున్న అంపన్: ఉత్తరాంధ్ర గజగజ, అప్రమత్తమైన అధికార యంత్రాంగం

ఈ తుఫాను ప్రస్తుతం ఒడిషాలోని పారాదీప్ కు దాదాపు దక్షిణంగా 600 కిలో మీటర్ల దూరాన, పశ్చిమ బెంగాల్లోని దిఘాకు దక్షిణ నైరుతి దిశగా 750 కిలోమీటర్ల దూరానా కేంద్రీకృతమైంది. ఇది గంటకు 17 కిలోమీటర్లకు పైగా వేగాన్ని అందుకుంది. ఇది ఉత్తర ఈశాన్యంగా పయనించి రేపు సాయంత్రానికి బెంగాల్లోని సుందర్ బన్స్ సమీపాన తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తీరందాటే సమయానికి దీని ఉధృతి సూపర్ స్థాయినుంచి పెను తుపాను అంటే అతి తీవ్ర తుపాను స్థితికి చేరుతుంది. ప్రస్తుతం 275 కిలోమీటర్ల ప్రళయ భయంకరంగా ఉన్న తుపాను గాలులు తీరందాటే సమయానికి 200 కిలోమీటర్ల వేగానికి తగ్గుతాయి.

ఇప్పటికే 75 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. ఈరోజు బెంగాల్లో ఓ మాదిరి వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల మాత్రం అతిభారీ వర్షాలు కురుస్తాయని.. నేటి సాయంత్రం నుంచీ బెంగాల్లోని గంగా ప్రవాహ ప్రాంతాల్లో కుంభవృష్టి తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఒడిషాలోని గజపతి, గంజాం, పూరీ, జగత్సింగ్ పూర్, కేంద్రపారా జిల్లాలు ఇప్పటికే ఈ తుపాను ధాటికి గురయ్యాయి. పదిలక్షల మంది తీరప్రాంత వాసులను ఒడిషా సర్కారు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డిఆర్‌ఎఫ్ సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ రోజు ఒడిషాలోని భద్రక్, బాలాసోర్, మయూర్భంజ్, జైపూర్, కేంద్రపారా, కేంజార్ జిల్లాల మీద కూడా సూపర్ సైక్లోన్ ప్రభావం తీవ్రంగా పడనున్నది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios