Asianet News TeluguAsianet News Telugu

Amit Shah Tour: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో మార్పులు.. వివరాలు ఇవే..

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నేడు ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) రానున్నారు. అయితే అమిత్ షా తిరుపతి ( tirupati)పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి.

Amit Shah AP tour changes in tirupati schedule
Author
Tirupati, First Published Nov 13, 2021, 2:29 PM IST

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నేడు ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) రానున్నారు. అయితే అమిత్ షా తిరుపతి ( tirupati)పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్‌ షా.. రాత్రి 8.30 గంటలకు తిరుమల వెళ్లనున్నారు. రాత్రి 8.45 గంటలకు కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీవారి సేవలో ఆయన పాల్గొంటారు. అమిత్‌ షాతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకోనునున్నారు. 

తిరుమల శ్రీవారి దర్శనం ముగిసిన అనంతరం.. అమిత్ షా తిరుపతికి చేరుకుంటారు. అక్కడ తాజ్‌ హోటల్‌లో అమిత్ షా రాత్రి బస చేయనున్నారు. ఆదివారం ఉదయం నెల్లూరులో స్వర్ణ భారతి ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్‌లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం దక్షిణాది జోనల్ కౌన్సిల్‌ బేటీలో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, లెఫ్టినెంట్ గవర్నర్ లు కూడా పాల్గొననున్నారు. 

తొలుత అధికారులు ప్రకటించిన ప్రకారం అమిత్ షా శనివారం సాయంత్రం 7.40 గంటలకు తిరుపతి చేరుకుంటారు. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమవారం(నవంబర్ 15) రోజున శ్రీవారి దర్శనం అనంతరం అమిత్ షా తిరుగు ప్రయాణం అవుతారని తెలిపారు. కానీ తాజాగా ఆయన పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నట్టుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

అమిత్ షా పర్యటన నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు.  సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనున్న తిరుపతిలోని తాజ్ హోటల్‌ను శుక్రవారం పోలీసు ఉన్నతాధికరాులు పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. మరోవైపు అమిత్ షా పర్యటన నేపథ్యంలో తిరుపతి, రేణిగుంట, నెల్లూరు ప్రాంతాలు నిఘా నీడలో ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios