Asianet News TeluguAsianet News Telugu

అమెరికా ఎన్నికల్లో తెలుగు ఛానళ్ళ హదావుడి

అమెరికాలో ఓటు హక్కున్న వారిలో అత్యధిక తెలుగువారిలో ట్రంప్ కు మద్దతు దారులున్నారని, ఓటు హక్కు లేనివారంతా హిల్లరీ గెలవాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

America

అమెరికాలో ఎన్నకలు జరగటం ఎలాగున్నా, తెలుగు ఛానళ్ళలో జరుగుతున్న ప్రచారం మాత్రం అతిగా కనబడుతోంది. ఒక విధంగా విసుగును తెప్పిస్తోంది. ఏ ఛానల్లో చూసినా అమెరికా ఎన్నికల ప్రచారమే. పొద్దున లేచి టివి పెట్టడం ఆలస్యం రాత్రి టివి కట్టేసేంత వరకూ అమెరికా గురించి ఒకటే రొద.

ఒకసారి ట్రంప్ గెలుస్తారని మరో మరోసారి హిల్లరీ అని ఒకదాని తర్వాత మరో కార్యక్రమం. అక్కడికేదో వారిద్దరూ మనదేశానికి చెందిన వారైనట్లు, వారి గెలుపు మీదే మన దేశపు భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉన్నట్లుగా టివిల్లో ప్రచారం జరుగుతుండటం పట్ల పలువురు ఆశ్చర్యపోతున్నారు.

  అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచినా మనకు ఒకటే. ఇటు ట్రంప్ అయినా అటు హిల్లరీ అయినా అంతిమంగా అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తారు. ఆ లక్ష్యాలు ఏ దేశంతో ఒనగూరుతాయనకుంటే ఆ దేశంతో సంత్సంబంధాలు కొనసాగించక తప్పదు. అమెరికా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లుగానే అమెరికా విధానాలు రూపొందుతాయి కానీ ఇతర దేశాల ఆకాంక్షలు అమెరికాకు ఏమాత్రం పట్టవన్న సంగతి గతంలోనే ఎన్నో మార్లు రుజువైంది.

కాకపోతే ఏటికేడు అమెరికాలో నివశిస్తున్న భారతీయుల జనాభా పెరుగుతున్న దృష్ట్యా మన దేశీయుల ఓట్లు కూడా కీలకమైతే కావచ్చు. అయితే, అమెరికాలో నివశిస్తున్న భారతీయులకందరికీ ఓట్లు ఉండవన్న సంగతి కాడా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి అమెరికా ఎన్నికల్లో ఓట్లు వేసే భారతీయుల సంఖ్య తక్కువగానే ఉండవచ్చు.

కనీసం అమెరికాలో పదేళ్ళు నివశిస్తే గానీ అమెరికా ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం దక్కదు. మరి ఎందుకని ఇంత స్ధాయిలో మన తెలుగు ఛానళ్లు పోటీ పడి మరీ ప్రచారం చేస్తున్నాయో ఎవరికీ అర్ధం కావటం లేదు. పైగా ఇక్కడి నుండి ప్రత్యేకంగా బృందాలను అమెరికాకు కొన్ని ఛానళ్ళు పంపటం గమనార్హం. ట్రంప్ కు ఓటు వేయమని ఒక వర్గం, హిల్లరీకే ఓట్లు వేయించమని మరోక వర్గం పోటీ కూడా పడుతున్నట్లు ఛానళ్ళ ద్వరా తెలుస్తోంది.

  అయితే ఈ విషయమై అమెరికాలో మూడేళ్ళు ఉండి వచ్చిన కిలారు దిలీప్ ఏషియానెట్ తో మాట్లాడుతూ, మన టివిల్లో అమెరికా ఎన్నికల గురించి ఇం స్ధాయిలో ప్రచారం వస్తోందంటే అదంతా ట్రంప్ పనేనన్నారు. అమెరికాలో ఓటు హక్కున్న వారిలో అత్యధిక తెలుగువారిలో ట్రంప్ కు మద్దతు దారులున్నారని, ఓటు హక్కు లేనివారంతా హిల్లరీ గెలవాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

  తెలుగు రాష్ట్రాల నుండి అమెరికాకు వెళ్లి స్ధిరపడినవారు, అమెరికాకు వెళ్ళాలనుకుంటున్న వారి సంఖ్య బాగా ఎక్కువైన కారణంగా మన రాష్ట్రంలో అమెరికా ఎన్నికల ప్రచారం ఈ స్ధాయిలో జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. మన దగ్గర ప్రచారం ఎక్కువైనట్లు కనబడుతున్నా పెరిగిపోయిన ప్రసార, ప్రచార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావటం కూడా మరో కారణమని దిలీప్ పేర్కొన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios