వైఎస్సార్ జలకళ పథకానికి సవరణ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనిచేయని బోర్లున్న రైతులకూ వైఎస్సార్ జలకళ పథకం వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.

సర్వీసులో వున్న, పదవి విరమణ చేసిన ఉద్యోగులు అనర్హులని పేర్కొంది. రెండున్నర ఎకరాల భూమి వున్న రైతు గ్రూపులకూ ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది.

రైతు కుటుంబంలో ఒకరికి మాత్రమే వైఎస్సార్ జలకళ వర్తిస్తుందని వెల్లడించింది. పొలంలో మొదటి బోరు విఫలమైతే హైడ్రో జియోలాజికల్, జియో ఫిజికల్ సర్వే చేయాలని ఆదేశించింది. సర్వేలో నీటి లభ్యత నిర్థారణ అయ్యాకే రెండో బోరు వేసేలా నిబంధనలు రూపొందించింది.