గుంటూరు జిల్లాలో పర్యటిస్తోన్న అంబటి రాయుడు.. పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. !
Guntur: ఇటీవల క్రికెట్ అన్ని ఫార్మాట్ లకు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. త్వరలోనే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న రాయుడు.. ఒక పాఠశాలలో విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం చేశాడు. దీనికి సంబంధించి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Ambati Rayudu: ఇటీవల క్రికెట్ అన్ని ఫార్మాట్ లకు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. త్వరలోనే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న రాయుడు.. ఒక పాఠశాలలో విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం చేశాడు. దీనికి సంబంధించి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఆయన క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ప్రజల కోసం మిగతా జీవితం కొనసాగిస్తానని తన పొలిటికల్ ఎంట్రీకి గురించి వెల్లడించారు. గుంటూరు లోని అన్ని ప్రాంతాలను సందర్శించిన తర్వాత తన భవిష్యత్తు ప్రణాళికల గురించి చెబుతానని మీడియాతో అన్నారు.
ఇవరాల్లోకెళ్తే.. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ముట్లూరు గ్రామంలోపునీత శౌరివారి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. అక్కడి నుంచి స్థానిక శౌరివారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వెళ్లారు. అక్కడి విద్యార్థులతో కూర్చుని మాట్లాడం, కలిసి భోజనం చేశారు. అలాగే, పాఠశాల ఏర్పాటు, ఇక్కడ కల్పిస్తున్న వసతులు, విద్యార్థుల ఫలితాల గురించి హెచ్‌ఎం జోస్పిన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అంబడి రాయుడు మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేవారు. జిల్లాలో ప్రతి ప్రాంతం, ప్రతి ఊరుకు వెళ్తానని చెప్పారు. ప్రజాసేవ చేయడానికి నిర్ణయం తీసుకున్నాననీ, దీనికి అనుగుణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, ఇబ్బందుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు.
ఆయా విషయాలు తెలుసుకున్నాక.. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగనున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే జిల్లాల్లోని గ్రామాలను సందర్శిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఈ ఏడాది జరిగిన టాటా ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై విజయం సాధించింది. ఈ జట్టు విజయంలో రాయుడు తనదైన పాత్ర పోషించారు. అయితే, ఊహించని విధంగా క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత మర్యాదపూర్వకంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసారు. క్రికెటర్ గా మంచి గుర్తింపు, నిజజీవితంలో మంచి నిబద్దత కలిగిన వ్యక్తిగా అంబటి రాయుడు పేరు సంపాదించుకున్నారు. ఇక ప్రజా సేవ చేయడానికి ఆయన రాజకీయ ప్రవేశం చేయనున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన తన కలల గురించి ప్రస్తావించారు.