గుంటూరులో వైసీపీ నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’కు ఆయనను అంబాసిడర్ గా నియమించింది. గుంటూరు నుంచి ఎంపీ టికెట్ ఆశించారు అంబటి రాయుడు. 

గుంటూరు : కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేనలో చేరబోతున్నారా అంటూ అవుననే వినిపిస్తోంది. వైసీపీలో చేరిన పది రోజులకే రాజీనామా చేసిన అంబటి రాయుడు ఆ తరువాత తాను దుబాయ్ టోర్నమెంటులో పాల్గొంటున్నట్లు ట్వీట్ చేశారు. కానీ ఇంతలోనే జనసేనలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

గుంటూరులో వైసీపీ నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’కు ఆయనను అంబాసిడర్ గా నియమించింది. గుంటూరు నుంచి ఎంపీ టికెట్ ఆశించారు అంబటి రాయుడు. అయితే, వైసీపీలో సర్వేల ఆధారంగా టికెట్ల విషయంలో కఠినంగా ఉంటున్న వైఎస్ జగన్ గుంటూరు టికెట్ అంబటి రాయుడికి ఇవ్వలేమన్న సమాచారంతో రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఇవ్వాళ, రేపట్లో జనసేనలో చేరతారని, పవన్ కల్యాణ్ తో భేటీ అవుతారని సమాచారం.వైసీపీకి రాజీనామా చేసిన వారంలోపే జనసేనలో చేరతారని వెలుగు చూడడంతో ఇప్పుడీ అంశం సంచలనంగా మారింది.