Ambati Rambabu: ఆంధ్ర‌ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఆగ్ర‌హం వ్యక్తంచేశారు.  ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం కీలకమైన పనులే టేకప్ చేశామ‌నీ. రెండు సార్లు కోవిడ్ వచ్చినా పనులు ఆగకుండా చిత్తశుద్ధితో పని చేశామ‌ని అన్నారు  

Ambati Rambabu: మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కరోనా సంక్షోభం వచ్చినా కూడా సంక్షేమ పథకాలు ఆగలేదు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ ప్రాజెక్టులు చేపట్టారు? రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్కటైనా మొదలుపెట్టారా? పనులు పూర్తి చేసి ప్రారంభించిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా? అని అంబటి రాంబాబు నిల‌దీశారు. ప్రాజెక్టులపై చంద్రబాబు చేసిన వ్యయం చెబుతున్నారే.. కానీ ఏం పూర్తి చేశాడో ఆ మీడియా చెప్పలేకపోతున్నదనీ, అంటే చంద్రబాబు మొత్తం తినేశాడనే కదా?
దీన్నే గత ఎన్నికల్లో ప్రధానిగారు కూడా చెప్పారు కదా? పోలవరంను చంద్రబాబు ఏటీఎంగా మార్చారని మోదీ అన్నారని గుర్తు చేశారు.

బురద చల్లడమే వారి పని:

ఈనాడు పత్రిక కొన్ని కధనాలు ప్రచురించే కార్యక్రమం చేపట్టింది. మొన్న కూడా పోలవరం పునరావాసం రెండు ముక్కలు అని కధనం రాశారు. ఇది కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది అని రాశారు. నేను దానికి సమాధానం చెప్పి, కొన్ని ప్రశ్నలు అడిగాను. అయితే వాటికి సమాధానం చెప్పకుండా, ఇంకొన్ని కధనాలు వండి వార్చి, సీఎం వైయస్‌ జగన్‌పైనా, ఈ ప్రభుత్వంపైనా బురద చల్లుతున్నారు. అలా మళ్లీ చంద్రబాబును లేపే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ప్రాజెక్టులపై రూ.55 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే, ఈ ప్రభుత్వం మూడేళ్లలో రూ.15 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని రాశారు. ఆ విధంగా ఆనాడు చంద్రబాబు ఏటా సగటున రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తే.. జగన్‌ ప్రభుత్వం కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, నీటి ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేదని రాశారని అన్నారు. వాళ్ళు ఇలా అవాస్తవాలు పదే పదే చెబుతున్నారు. అందుకే మాట్లాడాల్సి వస్తోందని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏనాడూ ప్రాధాన్యత కలిగిన కీలక పనులేవీ చేయలేదనీ, వారి పనులన్నీ అప్రధాన్యమైనవి. కాంట్రాక్టర్లకు చాలా మిగిలే పనులు. చాలా సులువుగా చేసే పనులు మాత్రమే చేశారనీ, కానీ మా ప్రభుత్వం వచ్చాక, అన్నీ సమీక్షించి, ఏ పనులు చేస్తే ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తవుతాయో అవే చేస్తున్నామ‌నీ, వాటి మీదే ఖర్చు చేస్తున్నామ‌నీ, రెండుసార్లు కోవిడ్‌ వచ్చింది. మూడు వేవ్‌లు వచ్చాయి. అయినా ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయడం కోసం పని చేస్తున్నామ‌నీ.. అయినా బురద చల్లుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

మా నాయకుడు ఆనాడే చెప్పారు

ఇటీవల వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఆ సందర్భంగా సీఎంగారు ఒక మాట చెప్పారు. కేవలం చంద్రబాబుమీద మాత్రమే కాకుండా ఎల్లో మీడియా మీద.. రామోజీరావు మీద, రాధాకృష్ణ మీద, టీవీ5 మీద అని చెప్పారు. ఈ రెండేళ్లు వారు కలిసికట్టుగా విష ప్రచారం చేస్తారని అన్నారు. ఇప్పుడు అదే జరుగుతోంద‌నీ, రామోజీరావు ఆ పని మొదలు పెట్టారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

చంద్రబాబు ఒక్క ఎకరాకైనా నీరిచ్చారా?

నాడు నదీ జలాలన్నీ సద్వినియోగం కావాలని, భూములు సాగు కావాలని, రైతులు బాగు పడాలని వైయస్సార్‌ జలయజ్ఞంలో 54 ప్రాజెక్టులు చేపట్టారనీ, ఆ తర్వాత మ‌ళ్లీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. 6 ప్రాధాన్యత ప్రాజెక్టులు చేపట్టి, ఆ పనులు చేస్తున్నామనీ. ఈ మ‌ధ్య‌కాలంలో కోవిడ్‌ వల్ల పనుల్లో కాస్త ఆలస్యం అవుతోందని అన్నారు. 

చంద్ర‌బాబు ప్రాజెక్టులపై బాగా ఖర్చు చేశారని రామోజీరావు రాశారు. మరి ఒక్క ఎకరానికి అయినా ఆయన నీళ్లిచ్చారా? 1995లో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు, తన హయాంలో ఏ ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేసి, రైతులకు నీళ్లిచ్చారా? ఎంతసేపూ సులభంగా అయ్యే పనులు, కాంట్రాక్టర్లకు బాగా మిగిలే పనులు చేసి కమిషన్లు పొందాడు తప్ప, ఒక్క రైతుకు కూడా మేలు చేయలేదు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యాన్ని.. స్వయంగా మోదీగారు అన్నారనీ, చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను ఏటీఎంగా వాడుకుంటున్నారని గుర్తు చేశారు. అందుకే రామోజీరావుకు, రాధాకృష్ణకు, టీవీ5ని ఒక్కటే కోరుతున్నా. ఇకనైనా వాస్తవాలు రాయండి. మీరు ఎంత లేపినా చంద్రబాబు తిరిగి సీఎం కాలేరని ఏద్దేవా చేశారు.