విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ పై పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. జగన్ అసమర్ధడు. ప్రతిపక్షనేతగా కూడా పనికిరాడు అంటూ విమర్శిస్తున్నావ్. మీలా ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ పార్టీని నడపలేక పారిపోలేదన్నారు. 

అవినీతికి, దోపిడీలకు పాల్పడుతున్న చంద్రబాబును ప్రశ్నించడంమాని పవన్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి కూడా మాట్లాడుతున్నాని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తన పార్టీని గెలిపించుకున్న తర్వాత దురదృష్టవశాత్తు మరణించారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. 

వైఎస్ జగన్ కు దైర్యం లేదని పదేపదే అంటున్న పవన్ చెప్తున్నా వినండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే ధైర్యం అంటూ కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి పరిస్దితులనైనా ఎదుర్కొంటామని మీలా పారిపోమన్నారు. 

ప్రజారాజ్యం పెట్టి ఆ పార్టీని నడపలేక వేరే పార్టీలో విలీనం చెయ్యడం ఆ తర్వాత పారిపోయింది నువ్వు కాదా అంటూ నిలదీశారు. మిమ్మల్ని నమ్ముకున్న వారిని నట్టేట ముంచి వెళ్లిపోయిన చరిత్ర మీది కాదా అంటూ మండిపడ్డారు. పవన కళ్యాణ్ ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రజాస్వామ్యంలో పవన్ మీ లాంటి నడక మంచిది కాదని హితవు పలికారు.