ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయనకు భద్రతను పెంచారు.

తాడేపల్లిలోని జగన్ నివాసం, పార్టీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీని టైట్ చేశారు. వైసీపీ ఘన విజయం తర్వాత ఒక్కసారిగా జగన్ నివాసానికి నేతలు, కార్యకర్తల తాకిడి పెరిగింది. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది.

ఇక జగన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌‌గా.. చంద్రబాబు సెక్యూరిటీని చూసిన అమర్లపూడి జోషిని ఏపీ పోలీస్ శాఖ నియమించింది. ప్రస్తుతం ఏపీ సెక్యూరిటీ వింగ్‌లో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

భద్రతాపరమైన అంశాలను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్వ విశ్వజిత్, గుంటూరు ఐజీ రాజీవ్ కుమార్ మీనాలు పర్యవేక్షిస్తున్నారు. జగన్ నివాసం, పార్టీ కార్యాలయ ప్రాంతాలు, ఆ వైపు వెళ్లే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.