Asianet News Telugu

అమరావతి ల్యాండ్ స్కామ్.. ఆధార్డ్ కార్డ్ ఇచ్చి సాక్షి సంతకం చేస్తే రూ.500: వెలుగులోకి బ్రహ్మానందరెడ్డి లీలలు

అమరావతి భూ స్కామ్‌లో బ్రహ్మానందరెడ్డి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భూమిపుత్ర సంస్థలో కొందరు యువకులకు ఉద్యోగాలు ఇచ్చి.. వారి పేరుతో భూ లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. ఆధార్ కార్డ్, సాక్షి సంతకం చేస్తే రూ.500 ఇచ్చి కోట్లాది రూపాయల స్కామ్‌కు బ్రహ్మానందరెడ్డి తెరలేపినట్లుగా తెలుస్తోంది. 

amaravati land scam case updates ksp
Author
Amaravathi, First Published Jul 6, 2021, 6:28 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి భూ స్కామ్‌లో బ్రహ్మానందరెడ్డి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భూమిపుత్ర సంస్థలో కొందరు యువకులకు ఉద్యోగాలు ఇచ్చి.. వారి పేరుతో భూ లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. ఆధార్ కార్డ్, సాక్షి సంతకం చేస్తే రూ.500 ఇచ్చి కోట్లాది రూపాయల స్కామ్‌కు బ్రహ్మానందరెడ్డి తెరలేపినట్లుగా తెలుస్తోంది. తన డ్రైవర్ నాగరాజుతోనూ సాక్షిగా సంతకాలు చేయించాడు బ్రహ్మానందరెడ్డి. ఆయన అక్రమాలు తెలిసి డ్రైవర్ నాగరాజు పనిని వదిలివేసి వెళ్లిపోయాడు. తనకు తెలిసిన విషయాలను ఇప్పటికే సీఐడీకి రాతపూర్వకంగా ఇచ్చేశానని నాగరాజు చెబుతున్నాడు. ఈ నెల 8న నాగరాజు సీఐడీ విచారణకు హాజరుకానున్నాడు. 

కాగా, అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహరంలో ఓ రియల్ ఏస్టేట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి ప్రసాద్ కు సీఐడీ అధికారులు  మంగళవారం నాడు నోటీసులు ఇచ్చారు.అసైన్డ్ భూములను అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఆ పార్టీ నేతలు పథకం ప్రకారంగా అమరావతిలో భూములను  కొనుగోలు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అసైన్డ్ భూములను కూడ పథకం ప్రకారంగా కొనుగోలు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కొన్ని ఆధారాలను సీఐడీకి అందించారు.  

Also Read:అమరావతిలో అసైన్డ్ భూదందా: రియల్‌సంస్థ ఉద్యోగికి సీఐడీ నోటీసులు

రియల్ ఏస్టేట్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల పేరునే భూముల అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చోటు చేసుకొన్నాయని  ప్రసాద్ మీడియాకు చెప్పారు. తన స్వంత భూములను కూడ రియల్ ఏస్టేట్ వ్యాపారి తన పేరున రాయించుకొన్నాడని ఆయన ఆరోపించారు.  ఆనాటి అసైన్డ్ భూముల కొనుగోళ్లు, అగ్రిమెంట్ల వెనుక పెద్దల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.తన పేరున ఎంత భూమి ఉందో కూడ తనకు తెలియదన్నారు.ఆ సమయంలో రోజూ పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. నాటి కొనుగోళ్లు, అగ్రిమెంట్ల వెనుక పెద్దల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఈ విషయాలన్నీ తాను సీఐడీకి వివరిస్తానని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios