మహా పాదయాత్ర కొనసాగుతుంది: అమరావతి జేఎసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్
మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై అమరావతి జేఎసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ హర్షం వ్యక్తం చేశారు. అయితే కొత్త బిల్లు అమరావతికి అనుకూలంగా ఉండాలన్నారు. లేకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.
అమరావతి: మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ సర్కార్ తీసుకొన్న నిర్ణయంపై అమరావతి జేఎసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ స్వాగతించారు. అయితే తమ మహా పాదయాత్ర యధాతథంగా కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకొనే పేరుతో ప్రజలకు నష్టం చేసే బిల్లులను ప్రవేశ పెడితే తాము ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని puvvada sudhakar తెలిపారు. అయితే ప్రజలు ఏం కోరుకొంటున్నారో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో ఉన్న తాము ప్రసార సాధనాల ద్వారా మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకొన్న విషయాన్ని తాము తెలుసుకొన్నామన్నారు.ఈ విషయమై తాము అంతర్గతంగా చర్చించుకొన్నామని సుధాకర్ తెలిపారు.ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశ పెట్టే కొత్త బిల్లులో ఏముంటుందోననే విషయమై ఉత్కంఠగా చూస్తున్నామన్నారు. amaravatiనే రాజధానిగా కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
also read:మూడు రాజధానులపై జగన్ సర్కార్ వెనక్కి: హైకోర్టుకు ఏపీ ప్రభుత్వ అఫిడవిట్
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ న్యాయస్థానం నుండి దేవాలయం వరకు పాదయాత్రను అమరావతి జేఎసీ నవంబర్ 1న ప్రారంభించింది. డిసెంబర్ 17 వరకు యాత్ర సాగనుంది. తిరుపతి వరకు యాత్రను కొనసాగించాలని అమరావతి జేఎసీ నిర్ణయం తీసుకొంది. 45 రోజుల పాటు యాత్ర సాగుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి యాత్ర కొనసాగుతుంది.ఈ యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే ఏపీ హైకోర్టులో రైతులు పిటిషన్లు దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు రైతుల పాదయాత్రకు అనుమతిని ఇచ్చింది. ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యాత్రకు విపక్షాలు మద్దతును ప్రకటించారు. కానీ, వైసీపీ మాత్రం ఈ యాత్రను టీడీపీ నడుతుపున్న ఉద్యమంగా ఆయన పేర్కొన్నారు.
బీజేపీకి చెందిన ఏపీ రాష్ట్రానికి చెందిన అగ్ర నేతలు ఆదివారం నాడు నెల్లూరు జిల్లాలో అమరావతి రైతలు మహా పాదయాత్రలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఇటీవల కాలంలో తిరుపతికి కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చారు. ఈ సమయంలో ఏపీ రాష్ట్ర రాజధాని అంశానికి సంబంధించి బీజేపీ నేతలతో అమిత్ షా చర్చించారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని బీజేపీ నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలుంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. అమిత్ షా ఆదేశంతో పాదయాత్రలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.అయితే మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు జగన్ సర్కార్ ఏపీ హైకోర్టుకు సోమవారం నాడు తెలిపింది.అయితే కొత్త బిల్లులో ఏ రకమైన అంశాలు ఉంటాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మూడు రాజధానుల చట్టానికి న్యాయ పరమైన ఇబ్బందులు తొలగించేందుకు వీలుగా కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు వీలుగా ఏపీ సర్కార్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకొందనే ప్రచారం కూడా లేకపోలేదు.అయితే జగన్ సర్కార్ ఏపీ హైకోర్టుకు ఏం చెబుతుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.