అమరావతి: అమరావతిపై ఏపీ సర్కార్ తాడోపేడో తేల్చనుంది. ఈ మేరకు అన్ని ఏఱ్పాట్లు చేసింది. ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో హై పవర్  కమిటీ సమావేశానికి ఆమోదం తెలపనుంది. 

అమరావతిపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల నివేదికలపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది.

Also read: రాజకీయాల నుండి తప్పుకొంటా, ఇలా చేస్తారా: జగన్ కు బాబు సవాల్

జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ  కమిటీ నివేదికలపై అధ్యయనం చేసేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది జగన్ సర్కార్. హైపవర్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నెల 17వ తేదీన హైవపర్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. 

ఈ నెల 17వ తేదీ లోపుగా రాజధానికి చెందిన రైతులు తమ సమస్యలను, సూచనలు, సలహాలను ఇవ్వాలని కూడ హైపవర్ కమిటీ సూచించింది. ఈ నెల 20వ తేదీన ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలపనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

కనీసం రెండు రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ రెండు రోజుల సమావేశాల్లో  మూడు రాజధానుల విషయమై చర్చించనున్నారు. హైపవర్ కమిటీ నివేదికను అసెంబ్లీ ముందు ఉంచాలని సర్కార్ భావిస్తోంది.

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సంకేతాలను ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రతిపాదనను  టీడీపీ, జనసేన, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అమరావతి పరిరక్షణ జేఎసీ ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ కూడ అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేసింది.ఈ మేరకు కోర్ కమిటీ తీర్మానం చేసింది. ఈ నెల 20వ తేదీన అమరావతి భవితవ్యం తేలనుంది.