చీరాల వైసీపీలో నేతల మధ్య పోరు ముదురుతోంది. మాటల యుద్ధం స్థాయి దాటి వ్యవహారం పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసే దాకా వెళ్లింది.
చీరాల వైసీపీలో నేతల మధ్య పోరు ముదురుతోంది. మాటల యుద్ధం స్థాయి దాటి వ్యవహారం పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసే దాకా వెళ్లింది. తాజాగా ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీతపై చీరాల వైసీపీ ఇన్‌ఛార్జ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆమంచి కృష్ణమోహన్ ఫిర్యాదు చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి కార్యక్రమంలో తనపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని, వారిద్దరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆమంచి ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీనీ గానీ, చంద్రబాబును గానీ బలరామ్ ఆయన కుమారుడు వెంకటేశ్ పల్లెత్తు మాట కూడా అనడం లేదని ఆమంచి ఆరోపిస్తున్నారు.
సొంత సామాజిక వర్గం మెప్పు కోసం తప్పితే జగన్‌పై, వైసీపీపై వారికి అభిమానం లేదని ఆమంచి విమర్శించారు. సొంత పార్టీవాడైనా తనపై విమర్శలు చేయడం దారుణమన్నారు.
వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గీయులు చీరాలలో పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించే కార్యక్రమాన్ని రెండు వర్గాలు పోటా పోటీగా కార్యక్రమాలను నిర్వహించాయి.
చీరాల ప్రజలకు స్వేచ్ఛను ఇస్తామని ఆనాడు ప్రమాణం చేశాం.. దీని కోసం తాము ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. చీరాలలో గతంలో బెదిరింపులు అరాచకాలు, బెదిరింపులు తగ్గినట్టుగా ఆయన గుర్తు చేశారు. చీరాలను అభివృద్ధి చేయడానికే తాము వైసీపీలోకి వచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు.
ఎవరిని బెదిరింపులకు తాము భయపడమని ఆయన స్పష్టం చేశారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అడుగు జాడల్లో పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు తామంతా కలిసిపనిచేస్తున్నామని ఆయన చెప్పారు.
