Asianet News TeluguAsianet News Telugu

పక్క చూపులు: చంద్రబాబుకు ఆమంచి షాక్ ఇస్తారా...

ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు గెలుపు గుర్రాలపై కసరత్తు ప్రారంభించాయి. ఎన్నిక‌ల ఫీవ‌ర్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అభ్యర్థులు సైతం తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. గెలుపు ఓటములను అంచనాలు వేసుకుని జంప్ చేస్తున్నారు. 
 

Amanchi is not happy in TDP
Author
Ongole, First Published Dec 26, 2018, 4:02 PM IST

ప్రకాశం: ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు గెలుపు గుర్రాలపై కసరత్తు ప్రారంభించాయి. ఎన్నిక‌ల ఫీవ‌ర్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అభ్యర్థులు సైతం తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. గెలుపు ఓటములను అంచనాలు వేసుకుని జంప్ చేస్తున్నారు. 

ఇప్పటి వరకు ఆయా పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలు ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో గోడలు దూకేందుకు రెడీ అవుతున్నారు. అయితే అలాంటి వారి జాబితాలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ చేరినట్లు తెలుస్తోంది. టీడీపీలో కొనసాగుతున్న ఆయన త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్తారని ప్రచారం జరుగుతుంది.  

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆమంచి కృష్ణమోహన్ 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ త‌ర్వాత అధికార పార్టీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 

చీరాల నియోజ‌క వ‌ర్గంలో ఎమ్మెల్యేగా ఆమంచి కృష్ణమోహన్ ఉన్నా తన రాజకీయ ప్రత్యర్థి పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం దానికి తోడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ తో రాజకీయ వైరం ఉండటంతో ఆపార్టీలో ఇమడలేకపోతున్నారట.   

పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆమెకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సన్నిహితుల వద్ద వాపోయేవారట. టీడీపీలో తనకు జరుగుతున్న అవమానాలపై రగిలిపోతున్న ఆమంచి కృష్ణమోహన్ సరైన టైమ్ కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ తో పొసగకపోవడంతో ఆయన పార్టీ వీడటమే మేలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దామచర్ల జనార్థన్ ఎమ్మెల్సీ పోతుల సునీతకు, పాలేటి రామారావులకు మద్దతుగా ఉంటూ ఆమంచికి సెగపెడుతున్నారని ఆయన వర్గీయలు ఆరోపిస్తున్నారు. 

వాస్తవానికి ఆమంచి కృష్ణమోహన్ కు దామచర్ల జనార్థన్ కు రాజకీయంగా శత్రుత్వం ఉన్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ దామచర్ల, ఆమంచిల మద్య పోరు ఉండేది. 

దాంతో చీరాలకు చెందిన టీడీపీ నేతలైన మాజీ మంత్రి పాలేటి రామారావు, పోతుల సునీతలతో ఎప్పటికప్పుడు ఆమంచి కృష్ణమోహన్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేసేవారు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవడం ఆ తర్వాత అధికార పార్టీలో చేరిన తర్వాత కూడా దామచర్ల వైఖరిలో ఏ మాత్రం మార్పులేదట. 

ఎప్పటిలాగే పాలేటి రామారావు, పోతుల సునీతలను ప్రోత్సహిస్తూనే ఉండటం జరిగింది. జనార్దన్‌ మద్దతుతో నియోజకవర్గంలో ఆమంచికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరిగేది. నియోజకవర్గంలో జరిగే ప్రతీ సమావేశానికి పోతుల సునీత, పాలేటి రామారావులను పిలిచి వేదికలపై మాట్లడించడం తనను పట్టించుకోకపోవడంపై ఆమంచి కృష్ణమోహన్ జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. 

జనార్దన్‌ వ్యవహార శైలిపై ఆమంచి పలుమార్లు సీఎంతో పాటు ఇటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఇన్‌ఛార్జ్, మంత్రి పరిటాల సునీతకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఒక దశలో పార్టీకి దూరమౌతానని కూడా ఆమంచి హెచ్చరించినట్లు సమాచారం.  

ఇకపోతే  ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడులోనూ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ ఎమ్మెల్యే ఆమంచిని అవమానించేలా ప్రవర్తించారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును పిలిచి ఆమంచిని పిలవలేదు. 

దీంతో మళ్లీ పిలుస్తారేమోనని ఆమంచి చూసినా పిలవకపోవడంతో కొద్దిసేపటి తర్వాత వేదికపైకి వెళ్లారు. ముందు సీటు కూడా కేటాయించకపోవడంతో వెనుక వరుసలో కూర్చోవాల్సి వచ్చింది.  ఈ అవమానాన్ని భరించలేని ఆమంచి ఆ కొద్దిసేపు ముళ్లమీద కూర్చున్నట్లైంది. కాసేపటి తర్వాత ఆయన సభ నుంచి వెళ్లిపోయారు.
 
మహానాడులో దామచర్ల జనార్థన్ తనను అవమానించేలా వ్యవహరించడంతో గుర్తుకు తెచ్చుకున్న ఆమంచి కృష్ణమోహన్ గట్టి దెబ్బ కొట్టారు. మంత్రి నారా లోకేష్‌ చీరాల పర్యటన సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జనార్దన్‌ ఫోటో వెయ్యలేదు. 

టీడీపీ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న దామచర్ల జనార్థన్ ను కాదని టీడీపీ బీసీ నేత నూకసాని బాలాజీ ఫోటోలు వేయించడంపై దామచర్ల అక్కసు వెళ్లగక్కారు. తన ఫోటో వేయకపోవడంపై ఆగ్రహంతో రగిలిపోయారట.  

అంతేకాదు వివిధ గొడవల్లో తన వర్గానికి చెందిన కార్యకర్తలు, అభఇమానులు, నేతలపై పోలీస్ కేసులు నమోదు చేశారని వారికి విలువ లేకుండా చేశారని ఆగ్రహంతో ఉన్నారట ఆమంచి కృష్ణమోహన్. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

త్వరలోనే చంద్ర‌బాబుకు షాక్ ఇవ్వ‌డానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమంచి టీడీపీ వీడుతున్నారని అందుకు డేట్ కూడా ఫిక్ష్ చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఆమంచి పార్టీ మారుతున్నారన్న వ్యవహారం ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios