దళితులపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి.  ఈ క్రమంలో అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు... చింతమనేనిపై మండిపడ్డారు.

దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు. దళితుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించినందుకు గాను ఆయనపై జాతీయ ఎస్సీ కమిషన్‌‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

దళితుల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తానని, కులగజ్జి ఉన్న నేతలందరికీ తగిన బుద్ది చెబుతానని చింతమనేనిని హెచ్చిరించారు.

దళితులను రాజకీయాలకు పనికిరారని ప్రభాకర్ అంటున్నారని రాజ్యాంగం రాసింది అంబేద్కర్ అని.. ఆయన వల్లే చింతమనేని ఎమ్మెల్యేకాగలిగరని గుర్తు చేశారు. ఇప్పటికే ప్రభాకర్‌పై అన్ని వర్గాలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని వ్యాఖ్యానించారు.