సామాన్యులే కాదు వైద్యంకోసం కోట్లు ఖర్చుచేయడానికి సిద్దంగా వున్న రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులను సైతం కరోనా మహమ్మారి బలితీసుకుంటోంది. 

అమలాపురం: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. సామాన్యులే కాదు వైద్యంకోసం కోట్లు ఖర్చుచేయడానికి సిద్దంగా వున్న రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులను సైతం ఈ మహమ్మారి బలితీసుకుంటోంది. ఇలా తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే కరోనాతో మృతి చెందారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అమలాపురం మాజీ ఎమ్మెల్యే, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుడిపూడి చిట్టబ్బాయి ఇటీవలే కరోనా బారిపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆయన కాకినాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందారు. తాజాగా అతడి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించి గురువారం తుదిశ్వాస విడిచారు. 

read more కరోనా టెన్షన్ : ఆస్పత్రి నుంచి పరారైన బాదితుడి ఆత్మహత్య..!

మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి మరణవార్త తెలియగానే ముఖ్యమంత్రి జగన్ ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించి కుటుంబానికి సానుభూతి తెలిపారు. చిట్టబ్బాయి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా వుంటానని ముఖ్యమంత్రి ఆయన కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. 

ఇక సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ సబ్బంహరి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఆయన కరోనా నుండి సురక్షితంగా బయటపడాలని అన్ని పార్టీల నేతలు కోరుకుంటున్నారు.