చిత్తూరులో దారణం జరిగింది. కరోనా భయం ఓ యువకుడి నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. ఇక తాను రికవరీ కానేమోననే ఆందోళన ఆ యువకుడి బలవన్మరణానికి దారి తీసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

వివరాల్లోకి వెడితే.. కరోనా పాజిటివ్ తో చిత్తూరు జిల్లా కుప్పం ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స జరుగుతున్న క్రమంలో ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ఆ తరువాత రామకుప్పం మండలం కొల్లుపల్లెపాలర్ బ్రిడ్జి వద్ద శవమై తేలాడు. మృతుడిది శాంతిపురం మండలం నల్లపరెడ్డి యూరుగా పోలీసులు గుర్తించారు. 

ఇదిలా ఉండగా బుధవారం కరోనాతో బాధపడుతూ వైద్యం అందక ఏడాదిన్న చిన్నారి మృత్యువాతపడిన ఘటన మరువకముందే విశాఖలో అలాంటిదే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. కరోనా బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కీర్తి(14) బాలిక డాక్టర్ల సూచన మేరకు కేజిహెచ్ లో చేరింది. అయితే అక్కడ బాలిక ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ఇవాళ  మృతి చెందింది. 

యజమానికే మస్కా కొట్టిన గుమస్తా.. 10 కిలోల బంగారంతో ఎస్కేప్.. !...

అయితే బాలిక హెల్త్ కండిషన్ ను తమకు తెలియజేయ లేదంటూ బంధువులు కేజీహెచ్ వైద్యులపై మండిపడుతున్నారు. తాము ఆందోళనకు దిగడంతో సిసి టివి ఫుటేజ్ ల ద్వారా ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు చూపించి ఆపై మృతి చెందినట్లు వెల్లడించారని ఆరోపించారు. దీంతో ఆసుపత్రి వద్దే బంధువులు ధర్నాకు దిగారు.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona