కర్నూల్ జిల్లా ఆలూరులో వ్యవసాయ భూమి లేకున్నా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయడంపై ఆర్ఢీఓ విచారణ చేపట్టారు. ఎకరానికి రూ. 10 వేలు తీసుకొని రెవిన్యూ అధికారులు ఈ పాస్ పుస్తకాలను జారీ చేశారని ప్రచారం లో ఉంది.ఈ భూములను తాకట్టు పెట్టి కొందరు బ్యాంకు రుణాలు కూడా తీసుకొన్నారు.
కర్నూల్: Kurnool జిల్లా Aluru లో వ్యవసాయ భూమి లేకున్నా Pattadar Pass Books ను మంజూరు చేశారు. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను Bankల్లో తనఖా పెట్టి లబ్దిదారులు రుణాలు కూడా తీసుకొన్నారు. అయితే ఎకరానికి రూ. 10 వేలు చెల్లిస్తే వ్యవసాయ భూమి లేకున్నా కూడా పట్టాదారు పాస్ పుస్తకాలను మంజూరు చేసినట్టుగా ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ విషయమై RDO విచారణ చేపట్టారు.
ఆలూరు మండలంలోని మొలగవల్లి గ్రామంలో 864 ఎఫ్, 894 డీ సర్వే నెంబర్లు లేవు. అయితే ఈ గ్రామంలో సర్వే నెంబర్లపై పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు. సుమారు 5 వేల ఎకరాలకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేసినట్టుగా ఆర్డీఓ గుర్తించారు.
అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన Chandrasekhar అనే వ్యక్తికి పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేశారు. అంతేకాదు ఈ సర్వే నెంబర్లను ఆన్‌లైన్ లో కూడా నమోదు చేశారు. ఈ పాస్ పుస్తకాన్ని బ్యాంకులో తనఖా పెట్టి చంద్రశేఖర్ రూ. 20 లక్షలు అప్పుగా తీసుకొన్నాడు.
అయితే గ్రామంలో ఈ సర్వే నెంబర్ లో భూములు లేకున్నా కూడా ఆ నెంబర్లను ఆన్ లైన్ లో కూడా నమోదు చేయడంపై ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున తాము ఈ సర్వే నెంబర్లను ఆన్ లైన్‌లో నమోదు చేశామని చెబుతున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆర్డీఓ విచారణ చేపట్టారు.
గతంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో నకిలీ పాస్ పుస్తకాల ఘటనలు వెలుగు చూశాయి. రెవిన్యూ అధికారుల సహాయంతో అక్రమ పాస్ పుస్తకాల దందా వెలుగు చూసింది.
తాజాగా కర్నూల్ జిల్లాలోని ఆలూరులో పాస్ పుస్తకాల వ్యవహరం వెలుగు చూడడం కలకలం రేపుతుంది. పట్టాదారు పాస్ పుస్తకాల జారీ చేయడంలో ఎవరి పాత్ర ఉందనే విషయమై ఆర్డీఓ విచారణ చేస్తున్నారు. అయితే ఈ పాస్ పుస్తకాలను తాకట్టు పెట్టి రుణాలు పొందిన వారెవరున్నారనే విషయమై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పాస్ పుస్తకాలు పొందిన లబ్దిదారులకు రెవిన్యూల అధికారులకు మధ్య సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నారు.
ప్రభుత్వానికి సంబంధించిన విలువైన భూములను రెవిన్యూ అధికారుల సహకారంతో గతంలో కొందరు అక్రమార్కులు కబ్జాలు చేసిన ఘటనలు కూడా రెండు రాష్ట్రాల్లో చోటు చేసుకొన్నాయి. తెలంగాణలో హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా భూముల ధరలు పెరిగిపోవడంతో అక్రమార్కులు బరి తెగిస్తున్నారు. ఏపీ రాష్ట్రంలో కూడా విశాఖ సహా ప్రధాన నగరాల్లో కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. పలు పార్టీలకు చెందిన నేతలపై ఈ విషయ,మై ఆరోపణలు కూడా వచచాయి. చంద్రబాబు, జగన్ సర్కార్ లు కూడా ఈ విషయమై సిట్ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. విశాఖ భూముల విషయంలో కొందరు రాజకీయ నేతలపై ఆరోపణలు వచ్చింది. దీంతో వైసీపీ సర్కార్ సిట్ దర్యాప్తుును సమగ్రంగా చేపట్టాలని కూడా ఆదేశించింది.
