తన పర్యటనల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లేటప్పుడు కాన్వాయ్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని జగన్ గమనించారు.

దీంతో ఆయా మార్గాల్లో వెళ్లేటప్పుడు తన వలన జనం ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని పోలీస్, సీఎంవో అధికారులకు జగన్ సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించే పనిలో పడ్డారు.