పవన్ ను కాదని మరీ వెళ్ళాడుగా... అల్లు అర్జున్ ఫ్రెండ్ పరిస్థితి ఏంటో?

మెగా కుటుంబమంతా పవన్ కల్యాణ్ వైపు నిలిస్తే... అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడి కోసమంటూ వైసిపి అభ్యర్థికి మద్దతుగా నిలిచాడు. కానీ చివరకు ఏమయ్యింది... నంద్యాలలో అల్లు అర్జున్ మద్దతు కూడా వైసిపిని గెెలిపించలేకపోయింది. 

Allu Arjun friend  Shilpa Ravichandra Reddy defeat in Nandyal AKP

నంద్యాల : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సరిగ్గా పోలింగ్ కు ముందు ఆయన వైసిపి అభ్యర్థి ఇంటికివెళ్లి మరీ మద్దతు ప్రకటించారు. ఓవైపు మెగా హీరోలు, కుటుంబ సభ్యులతో పాటు తండ్రి అల్లు అరవింద్ కూడా జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచినా... అల్లు అర్జున్ మాత్రం వైసిపి అభ్యర్థికి మద్దతివ్వడం మెగా ఫ్యాన్స్, జనసేన శ్రేణుల ఆగ్రహానికి కారణమయ్యింది. అయితే పవన్ కల్యాణ్ ను కాదనిమరీ అల్లు అర్జున్ మద్దతుగా నిలిచిన వైసిపి అభ్యర్థి పరిస్థితి ఏమయ్యింది? అనేది తెలుసుకునేందుకు తెలుగు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.  

నంద్యాల బరిలో నిలిచిన వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కి అల్లు అర్జున్ మద్దతుగా నిలిచారు... అయినా ఫలితం లేకుండా పోయింది. టిడిపి కూటమి హవాముందు అల్లు అర్జున్ సపోర్ట్ పనిచేయలేదు... రవిచంద్రారెడ్డికి ఓటమి తప్పలేదు. ప్రెండ్ ను గెలిపించుకునేందుకు మామ పవన్ కల్యాణ్ ను కాదని అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగినా లాభం లేకుండా పోయింది. 

కూటమి తరపున నంద్యాల బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మహ్మద్ ఫరూఖ్ ఘన విజయం సాధించారు. ఆయన 12,333 ఓట్ల మెజారిటీలో గెలుపొందారు.  అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి  90,742 ఓట్లు మాత్రమే వచ్చాయి... కానీ ఫరూఖ్ కు 1,03,075 ఓట్లు వచ్చాయి.  

అయితే నంద్యాల వైసిపి అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతివ్వడం... సరిగ్గా పోలింగ్ కు ముందు అతడి ఇంటికెళ్ళడం వివాదాస్పదం అయ్యింది. మెగా ఫ్యాన్స్ తో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు అల్లు అర్జున్ తీరును తప్పుబట్టారు... పెద్దఎత్తున ట్రోలింగ్ చేసారు. నాగబాబు అయితే 'మనకు సపోర్ట్ చేయనివాడు మనవాడైనా పరాయివాడే'అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ ను ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేసారు. ఫలితాల తర్వాత కూడా అల్లు అర్జున్ పై పవన్ సపోర్టర్స్ అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు.

 

ఇలా అటు కుటుంబ సభ్యులతో, ఇటు అభిమానులతో మాటలు పడినా తన స్నేహితుడిని గెలిపించుకున్నాను అన్న ఆనందం కూడా అల్లు అర్జున్ కు లేకుండా పోయింది. టిడిపి కూటమి ప్రభంజనం ముందు అల్లు అర్జున్ చరిష్మా ఏమాత్రం పనిచేయలేదు... ఆయన స్నేహితుడు ఓడిపోక తప్పలేదు.  ఏదేమైనా ఏపీలో జనసేన పార్టీ 100 శాతం సక్సెస్ రేట్ తో పోటీచేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అల్లు అర్జున్  అభినందనలు తెలిపారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios