కర్నూల్: ఇప్పటికే మనుషుల మధ్య ప్రేమానురాగాలు, బాంధవ్యాలు తగ్గగా కరోణ మహమ్మారి రాకతో అవి మరింత తగ్గాయి. కరోనా భయంతో కన్నతల్లిని ఇంట్లోకి రానివ్వని కొడుకు, మృతదేహాన్ని రోడ్డుపైనే విడిచిపెట్టి పరారయిన బంధువులు... ఇలా అనేక సంఘటనలు మనుషుల్లో మానవత్వం ఎంత దిగజారిందో తెలియజేస్తున్నాయి. ఈ కరోనా అయినవాళ్ళు కానివాళ్ళు అన్న తేడా లేకుండా ఎవరికివారే యమునా తీరే అన్న విధంగా వ్యవహరింపచేస్తోంది.

కర్నూలు జిల్లాలొ జరిగిన ఓ సంఘటన అందుకు పూర్తిగా అద్దంపడుతోంది. కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డలో నివాసం ఉంటున్న వీరభద్రుడు అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అతడు హాస్పిటల్ లోనే ఐసోలేషన్ వార్డుకు వెళ్లకుండా ఇంట్లోనే హోమ్ క్వా రంటెన్  లో ఉన్నాడు. 

అయితే శనివారం ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వీరభద్రుడు కోలుకోలేక మృతిచెందాడు. ఒకపక్క భర్త శవం పక్కనే ఉన్నా తనివితీరా మృతదేహాన్ని ముట్టుకో లేక, అంత్యక్రియలు సొంతంగా నిర్వహించలేక... గుండెలవిసేలా ఏడవడం తప్పు ఏం చేయలేని పరిస్థితి అతడి భార్య ఏర్పడింది. ఇలా ఆ ఇల్లాలు పడ్డ బాధ వర్ణనాతీతం. 

వీడియో

"

బంధువులకు విషయం తెలిసి అందరూ ఆళ్లగడ్డ చేరుకున్నా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఆ ఇల్లాలి బాధ  గురించి తెలుసుకున్న వైద్య సిబ్బంది ఔదార్యం ప్రదర్శించారు. భర్త మృతదేహాన్ని చివరిసారిగా తాకే అవకాశం కల్పించారు. మృతదేహం నుండి కరోనా సోకకుండా ఆమెకు పిపిఈ కిట్టును  అందించారు.

ఆళ్ళగడ్డలో వీరభద్ర ట్రావెల్స్ నిర్వహకుడు వీరభద్రుడు చనిపోయిన తీరు అందరినీ తీవ్రంగా కలచివేసింది. చివరకి 
అతడి శవాన్ని కూడా కుటుంబసభ్యులకు ఇవ్వకుండా అంబులెన్స్ లో తీసుకెళ్తుంటే  బంధువులే కాదు చుట్టుపక్క వారంతా కన్నీరుమున్నీరయ్యారు. ఇలాంటి వ్యాధి ఎవరికి రాకూడదు అని ఆ దేవుని కోరుకున్నారు.