ఏసీబీ ఎదుట హాజరైన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల

Alla Ramakrishna Reddy  appeared  before ACB today.
Highlights

విచారణకు హాజరైన ఆళ్ల

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ సోమవారం ఏసీబీ ఎదుట హాజరయ్యారు. బినామీ ఆస్తుల కేసులో  ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఏసీబీ ఎదుట హాజరయ్యారు.

అనారోగ్య కారణాలతో రెండు సార్లు విచారణకు గైర్హాజరైన ఆళ్ల సోమవారం ఉదయం ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఏసీబీకి పట్టుబడ్డ గుంటూరు డీఎస్పీ దుర్గాప్రసాద్‌కి చెందిన అక్రమాస్తుల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యుల పేర్లను ఏబీసీ గుర్తించింది.

 దీనిపై విచారణకు రావాల్సిందిగా ఏసీబీ ఆళ్లకు నోటీసులు జారీ చేసింది. కాగా రెండు సార్లు తన తరపున న్యాయవాదులను పంపిన ఎమ్మెల్యే మూడో సారి స్వయంగా ఏసీబీ ముందు హాజరయ్యారు.

loader