ఆత్మకూరు ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి: నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు
ఆత్మకూరు ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ జాగ్రత్తలు కూడా తీసుకున్నామన్నారు.
నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా జిల్లా కలెక్టర్ Chakradhar Babu చెప్పారు. బుధవారం నాడు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు.. ప్రతి Polling కేంద్రం వద్ద Medical Team ఏర్పాటు చేయనున్నట్టుగా చెప్పారు. నిన్న సాయంత్రమే ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 23 ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు
. Atmakur Assembly Bypoll నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా కలెక్టర్ తెలిపారు. నియోజకవర్గంలో 123 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కోసం 1339 మంది పోలీసులు, 1032 మైక్రో అబ్జర్వర్లు, 142 మంది సెక్టార్ అధికారులు, 38 మంది మాస్టర్ ట్రైనీలను నియమించామని కలెక్టర్ తెలిపారు.
ఇప్పటికే ఓటర్లకు, పంచాయతీ కార్యదర్శులు, బీఎల్‌ఓలు, వలంటీర్లు పోలింగ్ స్లిప్‌లు పంపిణీ చేసినట్టుగా కలెక్టర్ తెలిపారు.. ఓటర్లు తప్పనిసరిగా స్లిప్‌లతో పాటు గుర్తింపు కార్డు, ఓటరు ఐడీ లేదా ఆధార్, బ్యాంకు పాస్ పుస్తకం, పాస్‌పోర్ట్ తదితర వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకు రావాలని కలెక్టర్ సూచించారు.. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఏపీ మంత్రి Mekapati Gautham Reddy అకస్మికంగా మరణించడంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో గౌతం రెడ్డి సోదరుడు విక్రంరెడ్డిని వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దింపింది. దీంతో TDP అభ్యర్ధిని బరిలోకి దింపలేదు. మరో వైపు ఈ స్థానం నుండి BJP తన అభ్యర్ధిని బరిలో నిలిపింది.
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 135 గ్రామ పంచాయితీలున్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,13,400 ఓటర్లున్నారు. వీరిలో 1,06,021 మంది పురుషులు కాగా, 1,07,368 మంది మహిళా ఓటర్లున్నారు. ఇప్పటివరనకు 41 లక్షల64వేల850 నగదును సీజ్ చేసినట్టుగా నెల్లూరు ఎస్పీ విజయరావు చెప్పారు. ఈ ఎన్నికల సమయంలో 100 కేసులు నమోదు చేశామన్నారు. 520 లైసెన్స్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని కరూడా ఎస్పీ వివరించారు.
ఆత్మకూరు ఉప ఎన్నిక స్వేచ్ఛగా ప్రశాంతంగా జరగాలంటే సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని వినియోగించాలని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో మర్రిపాడు, ఆత్మకూరు మండలాల్లో రిగ్గింగ్ జరిగిందని వీర్రాజు చెప్పారు.ఈ విషయమై సీఈఓకు వినతిపత్రం అందించారు.