కాకినాడ: రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఈ నెల 29వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెసు చెప్పిందని ఆయన అన్నారు.

తమ ఆహ్వానంపై తెలుగుదేశం పార్టీ ఇంకా స్పందించలేదని ఆయన శుక్రవారం మీడియాతో చెప్పారు. ఇతర రాజకీయ పార్టీలు ఈ సమావేశంలో పాల్గొంటాయని ఆయన చెప్పారు. జనసేన, వామపక్షాలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెసు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

ఇదిలావుంటే, విభజన హామీలపై ఫిబ్రవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ జరగనుంది. ఈ బంద్ కు ఇప్పటికే కాంగ్రెసు పార్టీ తన మద్దతు ప్రకటించింది.