అమరావతి : న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులను దూషిస్తూ లేఖ రాసిన సీఎం జగన్‌పై సత్వరం విచారణ చేయించాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. 

ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు అఖిల భారత న్యాయవాదుల సంఘం లేఖ రాసింది. న్యాయమూర్తులపై  తన లేఖలో జగన్ ఉపయోగించిన పదజాలం అభ్యంతరకరంగా ఉందన్నారు. 

తనకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారని న్యాయమూర్తులను తూలనాడుతున్నారని మండిపడ్డారు.  బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు న్యాయవ్యవస్థను న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారన్నారు.

న్యాయవ్యవస్థను దూషించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం జగన్ రాసిన లేఖపై సత్వరం విచారణ చేయించాలన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. 

న్యాయవ్యవస్థ స్వతంత్రను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అఖిల భారత న్యాయవాదుల సంఘం లేఖలో పేర్కొంది. గత నెలలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు లేఖ రాశాడు. సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణపై ఆ లేఖలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.