రేపటినుండే... మద్యం ప్రియులకు జగన్ సర్కార్ శుభవార్త

ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం ఉత్పత్తికి జగన్ సర్కార్ అనుమతిచ్చింది. 

Alcohol Production Starts in AP

అమరావతి: లాక్ డౌన్ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో వైన్ షాప్ లు మూసుకుపోవడంతో కొందరు మందుబాబులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మందు దొరక్క కొంతమంది మానసిక సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి మద్యం  ప్రియులు ఎగిరిగంతేసే నిర్ణయం తీసుకుంది ఏపి సర్కార్.

లాక్ డౌన్ కారణంగా ఇంతకాలం మూతపడ్డ డిస్టలరీలు రేపటి(ఆదివారం) నుండి తెరుచుకోన్నాయి. ఈ మేరకు డిస్టిలరీలు రేపటినుండి మద్యం ఉత్పత్తి చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏపీలో మద్యం ఉత్పత్తికి అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ప్రభుత్వ అనుమతితో ఆదివారం నుండి 20 డిస్టలరీలు  తెరుచుకొనున్నాయి. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా డిస్టిలరీలకు మద్యం ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. మద్యం తయారీ కంపెనీలను పూర్తిగా శానిజైట్ చేయాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. 

మద్యం తయారీ సమయాల్లో కార్మికులు సామాజిక దూరం పాటించండం తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. మద్యం తయారీ కంపెనీల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లు వేర్వేరుగా ఉండాలని ప్రభుత్వ సూచించింది. మద్యం తయారీ కంపెనీల్లో గుట్కా, సిగరేట్‌ నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీల్లో కార్మికులు లిఫ్టులు ఉపయోగించవద్దని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. 

దేశంలో రెండవదఫా విధించిన లాక్ డౌన్ కూడా మే3వతేదీతో ముగుస్తున్నందున నిన్న కేంద్రం లాక్ డౌన్ సడలింపులు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిపైన ప్రజల్లో తీవ్రమైన అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో పూర్తిగా ఆ 18 పేజీల డాక్యుమెంట్ ను విడుదల చేసింది. ఇందులో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో లాక్ డౌన్ ఎలా అమలు చేయాలో రాష్ట్రాలకు సూచించింది. 

 ఇందులో రెడ్ జోన్లలో మినహాయించి ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం షాపులకు అనుమతినిచ్చింది. కానీ షాప్ వద్ద ఒకేసారి అయిదుగురి కన్నా ఎక్కువ ఉండకూడదని.... దానితోపాటుగా రెండు గజాల భౌతిక దూరం తప్పనిసరిగా తెలిపింది. దీంతో ఏపి ప్రభుత్వం మద్యం తయారీకి తాజాగా అనుమతినిచ్చింది. దీంతో త్వరలోనే వైన్ షాప్ లు కూడా తెరుచుకునే అవకాశం వుందంటూ మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios