ఏపీలో తిరుపుతిలోని వాకాడులో అశోక స్తంభం వద్ద ఓ మద్యం దుకాణం వద్ద మద్యం కొనుగోలు చేసి సమీప కూల్ డ్రింగ్స్ షాపుల దగ్గర, చర్చికి వెళ్లే దారిలో తాగారు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ కాకుంటే ఇంకా ఎక్కడ తాగాలో సూచించాలని ఎస్సైని వారు డిమాండ్ చేశారు. 

అమరావి: మద్యం దుకాణం వద్ద మద్యం తాగరాదని అంటున్నారు. దీనికి దగ్గరలోని ఇతర దుకాణాల దగ్గరా తాగొద్దంటున్నారు. ఇంటికి పోతే మా భార్యలు ఇంట్లో తాగేదే లేదని తెగేసి చెబుతున్నారు. మరి.. ఈ కొన్న మందును ఎక్కడ తాగాలో మీరే చెప్పండి సారూ అంటూ కొందరు మందుబాబులు ఎస్సై చుట్టూచేరి ఆందోళన చేశారు. తమకు సమాధానం చెప్పాలని అడిగారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని వాకాడులో జరిగింది. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

వాకాడులోని అశోకస్తంభం వద్ద ఓ మద్యం దుకాణం ఉన్నది. అక్కడ మద్యం కొనుగోలు చేసిన కొందరు మందుబాబులు సమీపంలోని కూల్ డ్రింక్స్ షాపుల దగ్గర, చర్చికి వెళ్లే దారిలో తాగుతూ కనిపించారు. ఇది కొందరు బాటసారులు ఇబ్బందికరంగా మారింది. వారితో ఎదురవుతున్న ఇబ్బందులపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఎస్సై రఘునాథ్ స్పాట్‌కు వచ్చారు. 

Also Read: టిప్పు సుల్తాన్‌ను ప్రేమించే వారు కాదు.. రామ, హనుమ భక్తులే ఇక్కడ ఉండాలి: కర్ణాటక బీజేపీ చీఫ్

అక్కడ మందు తాగుతున్న వారిని ఎస్సై రఘునాథ్ మందలించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ వినగానే అందులో నుంచి కొందరు లేచి ఎస్సైతో వాదనకు దిగారు. తాము ఇంకా ఎక్కడ తాగాలో కూడా సెలవియ్యాలని అన్నారు. ఇంట్లో తాగడం మటుకు కుదరదని మందుబాబులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు వారిని హెచ్చరించాల్సి వచ్చింది. అక్కడి నుంచి వెళ్లకపోతే కేసు పెట్టాల్సి వస్తుందని అన్నారు. ఈ హెచ్చరికలతోనే వారికి ఇంటికి వెళ్లిపోయారు.