Alapati Rajendra Prasad Biography: ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.. ఏపీ రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నాయకుడు. తెలుగుదేశం పార్టీ స్థాపకులు ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు. అలాగే..చంద్రబాబుతో కలిసి రాజకీయ ప్రయాణం కొనసాగించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని తెలుసుకుందాం.
Alapati Rajendra Prasad Biography: ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.. ఏపీ రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నాయకుడు. తెలుగుదేశం పార్టీ స్థాపకులు ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు. అలాగే..చంద్రబాబుతో కలిసి రాజకీయ ప్రయాణం కొనసాగించారు. ఆయన తన రాజకీయ జీవితంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని తెలుసుకుందాం.
బాల్యం, కుటుంబ నేపథ్యం
ఆలపాటి రాజేంద్రప్రసాద్.. 1960 ఫిబ్రవరి 4వ తేదీన గుంటూరు జిల్లాలో ఆలపాటి శివరామకృష్ణ దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక, ఉన్నత విద్య గుంటూరు జిల్లాలోనే కొనసాగింది. ఆయన తండ్రి శివరామకృష్ణ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. స్టూడెంట్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సెక్రటరీగా పని చేశారు. ప్రముఖ లీడర్ గా ఆయన రాజకీయాల్లో కొనసాగారు. ఇలా తండ్రిని చూస్తూ ఆయన కూడా రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. అలా చదువుకునే రోజుల్లో స్టూడెంట్ ఫెడరేషన్ లో యాక్టివ్ గా పని చేసేవారు.
ఆయన సమాజసేవతోపాటు చదువులో కూడా ముందుండేవారు. ఆయన ఎల్ఎల్ బీ పూర్తి చేసిన తరువాత 1985లో హైదరాబాద్ వచ్చారు. ప్రముఖ సీనియర్ లాయర్ మువ్వా చంద్రశేఖర్ లాయర్ గారి దగ్గర జూనియర్ గా చేరారు. చంద్రశేఖర్ ఆనాటి సీఎం ఎన్టీఆర్, టీడీపీకి సంబంధించిన కేసులను వాదించేవారు. ఈ సమయంలో ఆ కేసులన్నీ వాదించే టీంలో ఆలపాటి రాజేందర్ లాయర్ గా చేరారు. ఈ సమయంలోనే సీనియర్ ఎన్టీఆర్ గారితో పరిచయం ఏర్పడింది. ఇక ఆలపాటి రాజేంద్రప్రసాద్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయన భార్య పేరు మాధవి. వీరికి ఇద్దరు సంతానం
రాజకీయ ప్రవేశం
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తండ్రి శివరామకృష్ణకు ఎన్టీఆర్ అంటే పిచ్చి.. ఆయన పార్టీ కోసం తన సొంత ఇంటిని, అలాగే ఆయనకు వచ్చే పింఛన్లు కూడా పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఈ విషయంలో ఆలపాటి కూడా తన తండ్రి బాటలో నడిచారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
ఈ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 1999లో రెండోసారి కూడా అదే నియోజకవర్గంలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ సమయంలో అంటే..(22 అక్టోబర్ 1999 నుండి 26 నవంబర్ 2001 వరకు) చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశాడు. ఈ సమయంలోనే రాష్ట్రంలో ఎన్నో పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారు.కానీ, ఆ తరువాత 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు.
దీంతో ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని తెనాలి నియోజకవర్గ నుంచి సాగించారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి సమస్యల పరిష్కరం కోసం పోరాటం చేసేవారు. కానీ, 2009 ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపొందలేదు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీపై విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించారు. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టిడిపికి బలమైన పోటీ ఇచ్చింది. టిడిపి తరఫున ఆలపాటి నిలబడితే వైసీపీ తరఫున అన్నాబత్తిని శివకుమార్ నిలబడ్డారు. ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున ఆలపాటి పోటీలో నిలవగా వైసీపీ తరఫున అన్నాబత్తిని శివకుమార్ నిలిచారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. శివకుమార్ ఎమ్మెల్యేగా నిలిచారు.
ఇక 2024 ఎన్నికల్లో తెనాలి నుంచి టిడిపి తరఫున ఆలపాటి రాజా పోటీ చేయాలని భావించారు. కానీ , ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి జనసేన టిడిపి పొత్తుతో ముందుకు వెళుతున్నాయి. చాలామంది ఇరు పార్టీల నాయకుడు తమ సీట్లు త్యాగం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీకి చెందిన రాజేంద్ర కాకుండా జనసేనలో కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ కి టిక్కెట్ కేటాయించారు. ఈ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే..ఆయనకు నియోజకవర్గంలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని పార్టీ సీనియర్లు హామిఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుపొందుతారో వేచిచూడాలి.
