రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇటీవల బీజేపీ రాజీనామా చేసిన ఆయన.. ఈ రోజు పవన్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం భారీ ర్యాలీతో ఆయన విజయవాడ బయలే దేరారు.

తన ఎమ్మెల్యే పదవికీ, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆకుల సత్యనారాయణ.. తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాదరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు మొయిల్ ద్వారా పంపించారు.

ఆయన వెంటనే.. ఆయన అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు బీజేపీకి రాజీనామా చేశారు. మరికాసేపట్లో విజయవాడలో పవన్ సమక్షంలో ఆకుల ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆకుల వెంటే.. ఆయన అభిమానులు కూడా జనసేనలో చేరనున్నారు. 

వచ్చే ఎన్నికల్లో పవన్ ఎక్కడి నుంచి పోటీచేయమంటే అక్కడి నుంచి తాను పోటీచేస్తానని ఆయన పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థను పవన్ కళ్యాణ్ ప్రక్షాళన చేస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన తెలిపారు.