తమకు ప్రజా మద్దతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదన్నది అఖిల వాదన. అఖిల వాదన బాగనే ఉంది కానీ రాజీనామాలకు చంద్రబాబు అంగీకరించొద్దూ? రాజీనామాలు చేసిన తర్వాత మళ్ళీ గెలుస్తామన్న నమ్మకమే ఉంటే చంద్రబాబు ఇంతకాలం ఎందుకు ఆగుతారు? పార్టీ మారటం తప్పని అంగీకరిస్తూనే రాజీనామా చేయాల్సిన పరిస్ధితిలు ఇపుడు లేవని సుజయకృష్ణ రంగారావు చెబుతున్నారు.
ఫిరాయింపు మంత్రులు రాజీనామాలు చేసేందుకు సాహసిస్తారా? ఫిరాయింపులపై సమాధానాలు చెప్పాలంటూ నలుగురు మంత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే కదా? సమాధానాలు చెప్పేందుకు నాలుగు వారాల గడువు కూడా ఇచ్చింది లేండి కోర్టు. అదే విషయమై ఫిరాయింపు మంత్రి అఖిలప్రియ నంద్యాలలో ఈరోజు మాట్లాడుతూ, కోర్టు నోటీసులు తమకు ఇంకా అందలేదన్నారు. నోటీసులు అందుకోగానే చంద్రబాబునాయుడుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఎటువంటి నిర్ణయం తీసుకునేందుకైనా తాము సిద్ధంగా ఉన్నట్లు అఖిల చెప్పటం గమనార్హం. ఎందుకంటే, తమకు ప్రజా మద్దతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదన్నది అఖిల వాదన. అఖిల వాదన బాగనే ఉంది కానీ రాజీనామాలకు చంద్రబాబు అంగీకరించొద్దూ? రాజీనామాలు చేసిన తర్వాత మళ్ళీ గెలుస్తామన్న నమ్మకమే ఉంటే చంద్రబాబు ఇంతకాలం ఎందుకు ఆగుతారు? నంద్యాల ఉపఎన్నిక కూడా ఫిరాయింపు ఎంఎల్ఏ నియోజకవర్గమే కదా? దీని ఫలితంతో ఫిరాయింపు మంత్రుల భవిష్యత్తేమిటో తేలిపోతుంది లేండి.
సరే, అఖిల ఎటువంటి నిర్ణయానికైనా రెడీ అంటోంది కానీ మిగిలిన ముగ్గురి పరిస్ధితేంటట? పార్టీ మారటం తప్పని అంగీకరిస్తూనే రాజీనామా చేయాల్సిన పరిస్ధితిలు ఇపుడు లేవని సుజయకృష్ణ రంగారావు చెబుతుండటం గమనార్హం. అంటే దాని అర్ధమేంటో?మిగిలిన ఆదినారాయణరెడ్డి, అమరానధరెడ్డిలు కూడా చంద్రబాబు నిర్ణయం మేరకు నడుచుకుంటామని మాత్రమే చెబుతు
