జెసి ప్రవర్తనతో విసిగిపోయిన విమాన సంస్ధల ఇకపై తమ విమానాల్లో ప్రయాణించేందుకు అనుమతించమంటూ స్పష్టంగా ప్రకటించాయి.

అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డిపై నిషేధం వేటు పడింది. ఏ విమానంలోనూ ప్రయాణించేందుకు లేకుండా విమానయాన సంస్ధలు నిషేధం విధించాయి. గురువారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయంలో ఇండిగో విమాన సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే కదా? దాని పర్యవసానమే ఈ నిషేధం. జెసి ప్రవర్తనతో విసిగిపోయిన విమాన సంస్ధల ఇకపై తమ విమానాల్లో ప్రయాణించేందుకు అనుమతించమంటూ స్పష్టంగా ప్రకటించాయి. అంటే జెసి ఇకపై ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్,, జెట్ ఎయిర్ వేస్ విమానాల్లో ప్రయాణించే అవకాశం కోల్పోయారు.

విమానాశ్రయ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించటం జెసికి ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా గన్నవరం విమానాశ్రయంలో ఇదే మాదిరి చేసారు. అప్పట్లో పోనీలే అని సిబ్బంది సరిపెట్టుకున్నారు. అయితే దాన్ని జెసి అలుసుగా తీసుకున్నారు. దాంతో ఎక్కడబడితే అక్కడ రెచ్చిపోతున్నారు. దాంతో ఇపుడు నిషేధం దెబ్బ పడింది. సరే. నిషేధం ఎంతకాలం ఉంటుందన్న విషయం వేరే సంగతి. అసలంటూ తప్పు చేసిన వారికి పనిష్మెంట్ ఉంటుందని తెలియాలి కదా? ఇపుడదే జరిగింది.