అమరావతి: ప్రతి ఏటా రూ.11వేల కోట్ల చొప్పున నాలుగేళ్లపాటు రూ.44వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఈ కోటి మంది మహిళల చేతికి ఇస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఈ సహాయం మహిళలకు  కచ్చితమైన ఆదాయాలు, ఉపాధిని కల్పించనున్నట్టుగా ఆయన తెలిపారు.

హిందుస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు ఒప్పందాలు చేసుకొంది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. 

సెర్ప్‌ సీఈఓ రాజాబాబు, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ సీనియర్‌మేనేజర్‌ జోసెఫ్‌వక్కీ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. మరో ఒప్పందంలో సెర్ప్‌ సీఈఓ రాజాబాబు, ఐటీసీ డివిజనల్‌ సీఈవో రజనీకాంత్‌ కాయ్‌ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సెర్ప్‌ సీఈఓ రాజాబాబు, హెచ్‌యూఓల్‌ జీఎస్‌ఎం చట్ల రామకృష్ణారెడ్డి మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సహానీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో హెచ్‌యూఎల్‌ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజివ్‌ మెహతా, ఐటీసీ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజివ్‌ పూరి, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ సీఈఓ, ఎండీ మధుసూదన్‌ గోపాలన్‌  పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అలాగే వ్యవస్థలో దిగువన ఉన్న వారి తలరాతలను మార్చకపోతే మార్పులు సాధ్యంకావన్నారు..గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మహిళల జీవితాలను మార్చాలని ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.ఈ నెల 12న వైయస్సార్‌ చేయూత ప్రారంభిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత మహిళలకు చేయూతను అందిస్తున్నామన్నారు. ఈ కేటగిరీలో ఉన్న మహిళలు కుటుంబ 
చేయూత కింద ఎంపిక అయిన మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేల ఇస్తామని తెలిపారు. ప్రతి ఏటా ప్రతి ఏటా రూ.18750లు ఇస్తామని చెప్పారు. 
ఈ సహాయాన్ని వారి జీవితాలను మార్చేందుకు ఉయోగపడాల్సిన అవసరం ఉందన్నారు.

ఇటీవలే అమూల్‌కూడా అవగాహన ఒప్పందం చేసుకోంది. ప్రభుత్వం చేయూత నిస్తుంది, బ్యాంకు రుణాలకు గ్యారంటీ ఇస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఈ కంపెనీలు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.

ఆగస్టు 12న సుమారు రూ.4500 కోట్లు ఈ పథం కింద ఇస్తున్నామని ఆయన తెలిపారు.సెప్టెంబరులో వైయస్సార్‌ ఆసరా అమలు చేయనున్నట్టుగా ఆయన వివరించారు.90 లక్షల స్వయం సహాయ సంఘాల వారికి ఆసరా అమలు చేస్తున్నట్టుగా చెప్పారు.చాలావరకు చేయూత అందుకున్న మహిళలకూ ఆసరా కూడా వర్తిస్తుందన్నారు. 

దాదాపు కోటి మందికిపైగా మహిళలకు ఆసరా, చేయూత అందించనున్నట్టుగా సీఎం చెప్పారు.దాదాపు 9 లక్షల మంది మహిళలకు దాదాపు రూ.6700 కోట్లు ఆసరా కింద ఏటా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నామన్నారు.

ఇలా ప్రతి ఏటా రూ.11వేల కోట్ల చొప్పున నాలుగేళ్లపాటు రూ.44వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఈ కోటి మంది మహిళల చేతికి ఇస్తున్నామన్నారు. 
ఈ సహాయం.. వారికి స్థిరమైన ఆదాయాలు ఇచ్చేదిగా, స్థిరమైన ఉపాధి కల్పించేదిగా ఉండాలన్నారు.