Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయాన్ని మరిచారా కేసీఆర్ గారు...: బిజెపి విష్ణువర్ధన్ రెడ్డి

ఉన్న హక్కులు పోగొట్టుకోవడం వల్లనే నేడు ఆంధ్ర‌-తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్ర ప్రజలకు ఈ పరిస్థితి వచ్చిందని బిజెపి ప్రధాన కార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

again telangana police stops ap vehicles... bjp secretary vishnuvardhan reddy reacts akp
Author
Guntur, First Published May 24, 2021, 1:26 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వాహనాలను తెలంగాణలోకి అనుమతించకపోవడంపై ఏపీ బిజెపి ప్రధాన కార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధాని అనే విషయాన్ని మర్చిపోయారా కెసిఆర్? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. 

''ఉన్న హక్కులు పోగొట్టుకోవడం వల్లనే నేడు ఆంధ్ర‌-తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్ర ప్రజలకు ఈ పరిస్థితి వచ్చింది. మనకున్న హక్కుల గురించి ఎందుకు అడగరు జగన్ గారు? కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద మళ్ళీ వాహనాలను అనుమతించడంలేదు తెలంగాణ పోలీసులు. ప్రతిరోజు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు నోరు ఏందుకు మెదపరు? అసలు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి రహస్య ఒప్పందం ఏమిటి?'' అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. 

read more  సహజీవనం చేసుకోండంటూ... ఆ పనిలో జగన్ బిజీ: నారా లోకేష్ సంచలనం

కరోనాను కట్టడి చేసేందుకుగాను ఏపీ సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు ఆంక్షలను మరింథ కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలోకి వాహనాలు ప్రవేశించాలంటే ఈ పాస్ తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

 ఈ పాస్ విషయం తెలియని చాలామంది ప్రయాణీకుల వాహనాలు తెలంగాణ ఏపీ సరిహద్దుల్లోనే నిలిచిపోయాయి. రాష్ట్రంలో 20 గంటల పాటు లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ పాస్ ఉంటేనే  రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి, పులిచింతల, రామాపురం చెక్ పోస్టులు తెలంగాణ పోలీసులు మూసేశారు. గుంటూరు జిల్లాకు సరిహద్దులోని పొందుగుల, నాగార్జునసాగర్ వద్ద  ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లో కూడా వాహనాలను నిలిపివేశారు.  

ఈ పాస్  లేకున్నా అంబులెన్స్ లతో పాటు అత్యవసర వాహనాలను  మాత్రం తెలంగాణలోకి అనుమతి ఇస్తున్నారు. ఈ పాస్ విషయం తెలియని చాలా మంది ప్రయాణకులు రోడ్లపైనే ఎదురు చూస్తున్నారు. ఈ పాస్ తీసుకొంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పడంతో  ఈ పాస్ కోసం ప్రయాణీకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.  

Follow Us:
Download App:
  • android
  • ios