అమరవాతిలోని సచివాలయంలో ఏపీ మంత్రులు  సమావేశమయ్యారు.  ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ రెగ్యులరైజేషన్‌తో పాటు పలు అంశాలపై మంత్రులు చర్చించారు. ఈ సమావేశానికి  మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,,ఆళ్ల నాని, ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు.  మీటింగ్  ముగిసిన అనంతరం  ఆదిమూలపు సురేష్‌ మీడియా మాట్లాడారు.  వైఎస్ఆర్‌ సిపి ప్రభుత్వంపై బురద చల్లే కుట్ర జరుగుతోందని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

వైసీపీలోకి వల్లభనేని వంశీ: యార్లగడ్డ గరంగరం, జగన్ వద్దకు పంచాయతీ

" ఇంగ్లీష్‌ మీడియంపై ఓ పత్రిక విషం చిమ్ముతోంది. ఆ పత్రిక అధిపతి చివరికి ఇంగ్లీష్ మాధ్యమాన్ని మతానికి ముడిపెట్టి విశ్లేషణ చేయడం దారుణం. 
 ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్ధులకు ఇంగ్లీష్‌ మాధ్యమం అందించి. మత మార్పిడీ చేయాలని చూస్తున్నారని ఆ పత్రికలో విశ్లేషించారు.  ఇంతకన్నా దుర్మర్గమైన రాతలు ఎక్కడైనా వుంటాయా? దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం" అన్నారు

"ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను అందుకుని రాష్ట్రానికి చెందిన విద్యార్ధులు మంచి అవకాశాలను అందుకోవాలి. చైనా, జపాన్ దేశాలకు చెందిన వారు కూడా ఇంగ్లీష్‌ నేర్చుకుని అమెరికా, యూరోప్ దేశాల్లో అవకాశాలను పొందుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ఇంగ్లీష్ మాధ్యమంపై నిర్ణయం తీసుకున్నారు."

 

రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తున్నాం. ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం ఎందుకు అవసరమో ఇప్పటికే సిఎం శ్రీ వైఎస్‌ జగన్‌ స్పష్టంగా వివరించారు.  ముఖ్యమంత్రి తన ఆలోచనలను రాష్ట్రప్రజలకు విపులంగా వివరించారు. విద్యార్ధులు రాబోయే రోజుల్లో వారి నైపూణ్యాలను పెంచుకోవాలని సిఎంగారు చెప్పారు. ఆంగ్ల బాషలో వారి పరిజ్ఞానంను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై విద్యార్ధులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

హిందూ సంప్రదాయాలను కాలరాయడమే వైసీపీ ధ్యేయమా..

దీనిని వక్రీకరిస్తూ... కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయి. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఎస్టీలకు 39శాతం, ఎస్సీలకు 49శాతం, మైనార్టీలకు 62శాతం మందికి మాత్రమే అందుబాటులో వుంది.  ఈ వర్గాలు అధికశాతం ప్రభుత్వ పాఠశాల్లోనే చదువుకుంటున్నారు. వీరందరికీ ఇంగ్లీష్ మీడియంను అందించినట్లయితే వారి జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది.  అలాగే ప్రపంచ వ్యాప్తంగా అనేక అవకాశాలను రాష్ట్రానికి చెందిన విద్యార్ధులు అందుకోగలరు.