అద్దంకి నియోకవర్గంలో వరుసగా మూడుసార్లు గొట్టిపాటి రవికుమార్ విజేతగా నిలిచారు. అయితే గెలిచిన మూడుసార్లు మూడు పార్టీల నుండి ప్రాతినిధ్యం వహించారు. తాజాగా నాలుగోసారి అతడు అద్దంకి బరిలో నిలిచారు. కాబట్టి అద్దంకి ప్రజలు మరోసారి గొట్టిపాటి వైపు నిలబడతారా లేక అధికార వైసిపి వైపు మొగ్గుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. అద్దంకి ఫలితంపై అటు రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
అద్దంకి రాజకీయాలు :
అద్దంకి ప్రజల తీర్పు అంతుపట్టుకుండా వుంది. గతంలో (2014) టిడిపి అధికారంలోకి వచ్చినపుడు వైసిపిని... వైసిపి అధికారంలో (2019) వచ్చినపుడు టిడిపిని గెలింపించారు. ఇలా రెండుసార్లు ప్రతిపక్షం తరపున గెలిచింది గొట్టిపాటి రవికుమార్ కావడం విశేషం. అంతకుముందు (2009) లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా మూడు పార్టీల నుండి మూడుసార్లు ఒకే అభ్యర్థి పోటీచేసి వరుసగా గెలవడం రాజకీయాల్లో అరుదు. ఇలాంటి రేర్ ఫీట్ ను సాధించిన గొట్టిపాటి మొదటిసారిగా ఒకేపార్టీ నుండి రెండోసారి పోటీ చేస్తున్నారు. ఇక అద్దంకి నుండి చెంచు గరతయ్య మూడుసార్లు, కరణం బలరాం రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
అద్దంకి నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
సంతమాగులూరు
ముండ్లమూరు
అద్దంకి
బల్లికురువ
కోర్సిపాడు
అద్దంకి అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య - 2,41,218
పురుషులు - 1,18,289
మహిళలు - 1,22,917
అద్దంకి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
అద్దంకి అసెంబ్లీ బరిలో పాణెం హనిమిరెడ్డిని దించుతోంది వైసిపి
టిడిపి అభ్యర్థి :
వరుసగా నాలుగోసారి, టిడిపి తరపున రెండోసారి అద్దంకి నుండి పోటీ చేస్తున్నారు గొట్టిపాటి రవికుమార్. ఆయన పేరును ఇప్పటికే టిడిపి అధికారికంగా ప్రకటించింది.
అద్దంకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;
అద్దంకి అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
పోలయిన మొత్తం ఓట్లు - 207501
టిడిపి - గొట్టిపాటి రవికుమార్ - 1,05,545 (50 శాతం) -12,991 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - చెంచు గరతయ్య బాచిన - 92,554 (44 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - శ్రీకృష్ణ కంచర్ల - 4375 (2 శాతం) ఓటమి
అద్దంకి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
పోలయిన మొత్తం ఓట్లు - 1,98,944
వైసిపి - గొట్టిపాటి రవికుమార్ - 99,537 (50 శాతం) - 4,235 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - వెంకటేశ్ కరణం - 95,302 (47 శాతం) - ఓటమి
