కర్నూలు: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సినీనటి శ్రీరెడ్డి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు రాజకీయాలు, సినిమాలు, క్యాస్టింగ్ కౌచ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ దుమ్ము ధుళిపిన శ్రీరెడ్డి తొలిసారిగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఘాటైన విమర్శలతో హాట్ హాట్ గా ఉండే శ్రీరెడ్డి ఈసారి తన మనసులోని మాటను బయటపెట్టింది. వైసీపీ యువనేతపై మనసు పారేసుకున్నానని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. అతనికి కనీసం ఒక్కరోజైనా భార్యగా బతకాలని ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదండోయ్ ఆ ఒక్కరోజు భార్యగా గడిపిన తర్వాత చచ్చినా పర్లేదంటోంది ఈ అమ్మడు. 

ఇంతకీ హాట్ బ్యూటీ శ్రీరెడ్డి మనసు దోచిన ఆ యువనేత ఎవరనుకుంటున్నారా ఇంకెవరు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా రాష్ట్రరాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ గా ఉంటూ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్థర్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.  

అంతేకాదు 23ఏళ్ల ప్రాయంలోనే ఓ హత్యకేసు ఆరోపణల్లో జైలుకు సైతం వెళ్లొచ్చారు సిద్ధార్థ్ రెడ్డి. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన తన పదునైన మాటలతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. మాస్ లీడర్ గా గుర్తింపు పొందారు.  

అంతేకాదు సీఎం జగన్ కు సైతం అత్యంత సన్నిహితమైన యువనాయకుల్లో ఒకరిగా బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి ఒకరు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్ సిద్ధార్థ్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. 

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తన తమ్ముడు అంటూ చెప్పుకొచ్చారు. సిద్ధార్థ్ రెడ్డిని తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఈ వ్యాఖ్యలు కర్నూలు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయంటే ఎంత ప్రభావితమైన నాయకుడో అర్థం చేసుకోవచ్చు.  
 
సిద్ధార్థ్ రెడ్డిలో ఏం చూసి పడిపోయిందో తెలియదు కానీ ఆతడ్నే మనువాడాలనుకుని కూర్చోంది. వాక్చాతుర్యానికి పడిపోయిందో లేక రాజకీయానికి పడిపోయిందో తెలియదు గానీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తోంది శ్రీరెడ్డి. నువ్ మగాడ్రా బుజ్జి అంటూ ప్రభాస్ సినిమా డైలాగులు కొట్టేసింది.  

 

అంతకుముందు నేను తొలిసారిగా నా పెళ్లి గురించి పోస్ట్ పెడుతున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆ వరుడు ఎవరబ్బా అంతా ఎదురుచూసిన తర్వాత బెరెడ్డి సిద్దార్ధ రెడ్డిపై పోస్టు పెట్టింది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కనీసం ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు.. ఆ తరువాత చనిపోయినా పర్లేదు అంటూ సెన్సేషనల్ పోస్టు పెట్టి రాజకీయంగా హీటెక్కించింది శ్రీరెడ్డి. 

మరి శ్రీరెడ్డి మనసుపారేసుకున్న, మనువాడాలనుకుంటున్న సిద్ధార్థ్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. రాజకీయాల్లో కాస్త దూకుడుగా ఉండే సిద్ధార్థ్ రెడ్డి నటి శ్రీరెడ్డి పోస్టులపై ఎలా రియాక్ట్ అవుతారోనని ఆసక్తికర చర్చ జరుగుతోంది.