‘పవన్ కళ్యాణ్ పోరాడితే.. హోదా వస్తుంది..’

actor shivaji sensational comments on janasena leader pawan kalyan
Highlights

పవన్ పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

ఏపీకి ప్రత్యేక హోదా కోసం నటుడు శివాజీ చేపట్టిన జాగారం విజయవంతమైంది.  గురువారం సాయత్రం 7గంటల నుంచి శుక్రవారం ఉదయం 7గంటల వరకు విజయవాడ ధర్నాచౌక్ లో శివాజీ ‘ హోదా కోసం జాగారం’ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ .. ‘‘విడివిడిగా కాదు. అంతా కలిసి పోరాటం చేద్దాం. ఆంధ్రుల సత్తా ఏమిటో చూపిద్దాం. ఐక్యంగా పోరాడి 2019 లోగా ప్రత్యేకహోదాను సాధిద్దాం’’ అని పిలుపునిచ్చారు.

‘‘దేశంలో ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రాల విభజనలో పాపమంతా బీజేపీదే. రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయాన్ని కన్నడీయులకు తెలియజేయడానికే నేను ఈ దీక్ష చేపట్టా’’ అని అన్నారు. కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని శివాజీ పిలుపునిచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు కేవలం వారి అవసరాల కోసమే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చేస్తున్నాయని, వారిలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేంద్రం రాష్ట్ర ప్రజలను బిచ్చగాళ్లలా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీకి ఓటు వెయ్యొద్దని, జేడీఎస్‌ని కూడా నమ్మడానికి లేదని అన్నారు. 8 మంది అవినీతిపరులకు బీజేపీ సీట్లు ఇచ్చిందని విమర్శించారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల వారంటే మోదీకి చిన్న చూపని శివాజీ ఆరోపించారు.
 
పవన్ కళ్యాణ్‌ పోరాడితే ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు. విమర్శలతో ఉపయోగం లేదని హోదా కోసం అందరూ ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. కొంతమంది ఉద్యోగాలు చేసేటప్పుడు రాష్ట్ర పాలన బావుంది అన్నారని..ఇప్పుడు బాగోలేదని పుస్తకాలు రాస్తున్నారని శివాజీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

loader