అమరావతి: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయనకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు నటుడు నరేష్. సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో వెలుగొందుతున్న తరుణంలో ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని చెప్పుకొచ్చారు నరేష్. 

పవన్ కళ్యాణ్ తన స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదని ప్రజల కోసం వచ్చారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం రాజకీయాల్లోకి వచ్చారని అదే చేస్తున్నారని ప్రశంసించారు నరేష్. 

పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సక్సెస్ అవుతారన్న విషయం పక్కన పెడితే పవన్ లాంటి నిస్వార్థ రాజకీయ నాయకులు ప్రస్తుతం అవసరమన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన వెంటనే అధికారంలోకి వచ్చేయడం అనేది అసాధ్యమన్నారు. 

ఆయనకి ముగ్గురు పెళ్లాలు, నాకు ఒక్కతే భార్య: పవన్ పై జగన్ సెటైర్.

గతంలో బీజేపీపై కూడా తీవ్ర విమర్శలు చేశారని అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారని గుర్తు చేశారు. కానీ అదే బీజేపీ కేంద్రంలో రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దేశంలో బీజేపీ తప్ప వేరే పార్టీ ఏది కనబడటం లేదన్నారు. 

డబ్బులకు దూరంగా, కులాలకు దూరంగా రాజకీయాలు చేయాలని పవన్ కళ్యాణ్ తాపత్రాయపడుతున్నారని చెప్పుకొచ్చారు. సామాన్యుడికి అందుబాటులో రాజకీయాలు తీసుకురావాలని పవన్ పరితపిస్తున్నాడని అందుకు ఆయనకు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 

పవన్ కళ్యాణ్ ఏదైతే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారో అది నెరవేరాలని మనస్ఫూర్తిగా తాను కోరుకుంటున్నట్లు తెలిపారు నరేష్. పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తోందన్నారు. 

తమ్ముడు నిరసన, అన్నయ్య ప్రశంసలు: జగన్ నిర్ణయంపై మెగాస్టార్ హర్షం.

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ రాజకీయ పార్టీలు ముఖ్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు నరేష్. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేసే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. 

పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడాన్ని చూస్తుంటే రాజకీయాల్లో ఇంతలా దిగజారుడుతనం ఉంటుందా అన్నసందేహం కలుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు మరుగున పడిపోయిందని, రాజధాని పనులు జరగడం లేదని వాటి గురించి చర్చించకుండా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ వ్యాఖ్యానించడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. 

ఒక వ్యక్తియెుక్క వ్యక్తిగత జీవితాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదని చివరికి న్యాయ స్థానాలకు కూడా లేదని నరేష్ వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు  కారణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని వాటిని ప్రజల్లోకి తీసుకురావాల్సిన హక్కు ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నరేష్. 

పవన్ భార్యలపై జగన్ వ్యాఖ్యలు: క్షమాపణలకు బాబు డిమాండ్, సిగ్గు లేదంటూ సీఎం ఫైర్..

వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని అది మంచి సంప్రదాయం కాదన్నారు. పవన్ విషయంలోనైనా తన విషయంలోనైనా ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్లు చేసుకుంటామని తప్పేంటంటూ మండిపడ్డారు. 

పెళ్లిళ్లు అనేది పెద్ద సబ్జెక్టు అని దాని గురించి మాట్లాడాలంటే చాలా చర్చ అవసరం అన్నారు. ఈరోజు పెద్దలు కుదిర్చిన వివాహాలు అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహాలైనా నిలబడటం లేదన్నారు. జీవితంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చూసుకుంటున్నామని తెలిపారు. 

ఇప్పటికైనా రాజకీయ నేతలు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడటం ఆపేసి రాష్ట్ర అభివృద్ధికోసం పనిచేస్తే బాగుంటుందని నరేష్ సూచించారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మంచి కార్యక్రమాలు అందించాలనే ఆలోచన చేస్తే మంచిదని అంతేకానీ పెళ్లిళ్ల గురించి కాదంటూ సెటైర్లు వేశారు నరేష్.  
అతడి ప్రజాజీవితం చాలా క్లీన్... జగన్ లా కాదు..: పవన్ ను వెనకేసుకొచ్చిన చంద్రబాబు...