శ్రీకాకుళంః  సినీనటుడు కృష్ణుడు ప్రజా సంకల్పయాత్రలో హల్ చల్ చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట నియోజకవర్గంలో 323వరోజు పాదయాత్రను జగన్ ప్రారంభించారు. నరసన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను సినీనటుడు కృష్ణుడు కలిశారు. 

వైఎస్ జగన్‌ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులకు ఉద్యోగాల కల్పనకు హామీ ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామన్న వైయస్‌ జగన్‌ హామీ పట్ల యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 

వేలాది మంది మహిళలు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొంటున్నారని, జగన్‌ సీఎం అయితే కష్టాలు తీరుతాయని మహిళలు భావిస్తున్నారని కృష్ణుడు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఫోటో ఫ్రేమ్ ను జగన్ కు అందజేశారు. 

ఇప్పటికే జగన్ ను అనేక మంది సినీనటులు కలిశారు. ఛోటా కె.నాయుడు, సినీనటుడు పోసాని కృష్ణమురళి, పృథ్వి, ఫిస్ వెంకట్ తోపాటు జబర్దస్త్ టీం కూడా జగన్ ను కలిశారు. దీంతో సినీ ఇండస్ట్రీ వైసీపీవైపు మెుగ్గు చూపుతుందంటూ ప్రచారం జరుగుతుంది.