వైసీపీలో చేరిన మరో సినీ నటుడు

First Published 6, Aug 2018, 10:36 AM IST
actor krishnudu joins in ycp
Highlights

సోమవారం పాదయాత్రలో భాగంగా కత్తిపూడిలో వైఎస్‌ జగన్‌ సమక్షంలో నటుడు కృష్ణుడు వైసీపీలో చేరారు. కృష్ణుడికి పార్టీ కుండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్‌.
 
వైసీపీకి సినీ మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే  పలువురు సినీ నటులు వైసీపీకి మద్దతు పలకగా.. మరో సినీ నటుడు కృష్ణుడు కూడా ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.  ప్రస్తుతం జగన్ తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా..జగన్‌ పాదయాత్రకు ఆకర్షితుడై సినీ నటుడు కృష్ణుడు వైసీపీలో చేరారు. 

సోమవారం పాదయాత్రలో భాగంగా కత్తిపూడిలో వైఎస్‌ జగన్‌ సమక్షంలో నటుడు కృష్ణుడు వైసీపీలో చేరారు. కృష్ణుడికి పార్టీ కుండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్‌.

పార్టీలో చేరిన అనంతరం కృష్ణుడు మాట్లాడుతూ.. జననేత వైఎస్‌ జగన్‌ పాదయాత‍్రతో స్ఫూర్తి పొంది తాను పార్టీలో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ విజయం సాధించడానికి తన వంతు కృషి చేస్తానని కృష్ణుడు పేర్కొన్నారు. ఈ క్యార్యక్రమంలో పార్టీ నేతలు పెన్మత్స సురేష్‌ బాబు, సర్రాజు, సూర్యనారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు.

loader