సినీనటుడు జగపతిబాబుయ రాజకీయాల్లోకి రానున్నారా..? అవుననే సంకేతాలు ఎక్కువగా కనపడుతున్నాయి. త్వరలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారం నిజమనిపించేలా.. మంగళవారం జగపతిబాబు ఏపీ రాజధాని అమరావతికి వచ్చి.. సచివాలయంలో చంద్రబాబు ని కలిశారు.

జగపతిబాబు.. ఇలా ప్రత్యేకంగా వచ్చి చంద్రబాబుని కలవడం వెనక ఏదో రాజకీయ కోణం ఉండే ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా.. టీడీపీ ఎమ్మెల్యే, చంద్రబాబు బావమరిది బాలకృష్ణ... కి జగపతిబాబు బాగా క్లోజ్ అన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే జగపతిబాబు టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. మరి కొందరు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు.  జగపతిబాబు ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారని.. ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదని చెబుతున్నారు. జగపతి.. తన కుటుంబానికి సంబంధించిన ఓ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చంద్రబాబుని ఆహ్వానించడానికి మాత్రమే సచివాలయానికి వచ్చారని చెబుతున్నారు. వాస్తవం ఎలా ఉన్నా.. చంద్రబాబు- జగపతిల భేటి ఎన్నికల వేళ ప్రాధాన్యత సంతరించుకుంది.