సినీనటుడు భానుచందర్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం నీచమని ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయం దారుణం అని మండిపడ్డారు. 

చంద్రబాబు నైజం గురించి ఎన్టీఆర్‌ ఆనాడే స్ఫష్టంగా చెప్పారు. ఆయన నాతో చెప్పిన మాటలు చెప్తే చంద్రబాబుకు పుట్టగతులుండవు అంటూ చెప్పుకొచ్చారు.  వైఎస్‌ జగన్‌ సంక్షేమపథకాలతో ప్రజలకి దగ్గర కావడం సహించలేకపోతున్నారు. 

అందుకే చంద్రబాబు ఇటువంటి కుట్రపూరిత కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్లు ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా మరో 15 ఏళ్లు సీఎంగా వైఎస్‌ జగన్‌ కొనసాగుతారు అంటూ సినీ నటుడు భానుచందర్‌ పేర్కొన్నారు.  

భానుచందర్ మొదటి నుంచి జగన్ కే తన మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఏపీ ఎన్నికల్లో వైసీపీదే విజయం అని, త్వరలోనే జగన్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. అది నిజం అయింది కూడా.